65వ జాతీయ అవార్డ్స్ ప్రదానం: శ్రీదేవిని జ్ఞాపకాలతో బోనీ.. బాహుబలి2, ఝాజీ మేకర్స్ హ్యపీ మూమెంట్

By Bojja Kumar

Recommended Video

Sree Devi Daughter Janhvi Kapoor Looks As Her Mum

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 65వ నేషనల్ అవార్డ్స్ ప్రధానోత్సవం ఢిల్లీలో గ్రాండ్‌గా జరిగింది. తెలుగు సినిమా పరిశ్రమ నుండి బాహుబలి చిత్రం 3 విభాగాల్లో జాతీయ అవార్డు గెలుపొందగా, ఉత్తమ తెలుగు చిత్రంగా 'ఘాజీ' చిత్రం ఎంపికైన సంగతి తెలిసిందే. వీటితో పాటు ఆయా విభాగాల్లో అవార్డులకు ఎంపికైన సినిమాలకు అవార్డుల ప్రధానోత్సవం కేంద్ర సమాచార, ప్రసార మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర సహాయమంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ చేతుల మీదుగా జరిగింది. శ్రీదేవి తరుపున బోనీ కపూర్, ఖుషీ కపూర్, జాహ్నవి కపూర్ అవార్డు అందుకున్నారు.

'బాహుబలి-ది కంక్లూజన్' చిత్రానికి గాను ఉత్తమ ప్రజాదరణ, వినోదాత్మక చిత్రం విభాగంలో నిర్మాత దేవినేని ప్రసాద్‌ అవార్డు అందుకోగా, ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఉత్తమ యాక్షన్‌ విభాగాల్లో కమల్‌ కన్నన్‌, కింగ్‌ సాల్మన్‌ పురస్కారాలు అందుకున్నారు. 'ఘాజీ' చిత్రం తరుపున సంకల్ప్‌రెడ్డి, నిర్మాత ప్రసాద్‌.వి.పొట్లూరి అవార్డులు అందుకొన్నారు.

65th National Film Awards prasantaions

అవార్డు అందుకోవడం బాహుబలి నిర్మాత ప్రసాద్ దేవినేని మాట్లాడుతూ... చిత్ర టీం మొత్తం ఐదేళ్లు కష్టపడటం వల్లే ఈ రోజు అవార్డు వచ్చిందన్నారు. ఈ అవార్డు తమపై బాధ్యత మరింత పెంచిందని తెలిపారు.

ఝాజీ దర్శకుడు సంకల్ప్‌రెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు తమలో మరింత ఉత్సాహాన్ని, బాధ్యతను పెంచిందని, మరిన్ని మంచి చిత్రాలు తీయడానికి కృషి చేస్తామని తెలిపారు.

'మామ' చిత్రానికిగాను ఉత్తమ నటి అవార్డు అందుకున్న శ్రీదేవి తరుపున.... ఆమె భర్త బోనీ కపూర్, కూతుళ్లు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్ అవార్డులు స్వీకరించారు. ఈ సందర్భంగా బోనీ కపూర్ మాట్లాడుతూ శ్రీదేవి ఈ పురస్కారానికి పూర్తిగా అర్హురాలని, ఈ సంతోష సమయాన్ని పంచుకోవడానికి ఆమె మన మధ్య లేక పోవడం దురదృష్టకరమని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X