యుద్ధ ప్రాంతంలో పీఎస్‌వీ గరుడ.. ప్రపంచంలోనే ఎత్తైన డ్యామ్‌పై షూట్

యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లోనే గతంలో ఎన్నడూ లేని విధగా రూ. 25 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో పీఎస్‌వీ గరుడ 126.18ఎం చిత్రం రూపొందుతున్నది.

By Rajababu

యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లోనే గతంలో ఎన్నడూ లేని విధగా రూ. 25 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో పీఎస్‌వీ గరుడ 126.18ఎం చిత్రం రూపొందుతున్నది. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమాకు ప్ర‌వీణ్ స‌త్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీన్లను జార్జియా యుద్ధ ప్రాంతంలో ఉన్న ఎంగూరి డ్యామ్‌పై చిత్రీకరించడం గమనార్హం. ఈ డ్యామ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాటిలో ఒకటి అని చిత్ర నిర్వాత వెల్లడించారు.

7 Days shoot in a war zone on the largest Dam in Georgia

ఎంగూరి డ్యామ్ ప్రపంచంలోనే ఎత్తైన డ్యామ్‌లలో ఆరోది. దీని ఎత్తు 271.5 మీటర్లు. జార్జియాలోని అబ్కాజియా ప్రాంతంలోని వార్ జోన్‌లో ఉన్నది. ఇలాంటి క్లిష్టమైన ప్రాంతంలో దాదాపు 7 రోజులపాటు చిత్ర యూనిట్ షూటింగ్‌లో పాల్గొననున్నది. జార్జియా, అబ్కాజియాన్ దళాల మధ్య ఉద్రిక్తమైన పరిస్థితులు తాజాగా నెలకొని ఉన్నాయి.

7 Days shoot in a war zone on the largest Dam in Georgia

ఇలాంటి పరిస్థితుల మధ్య పారాచూట్స్, మిలటరీ విమానాలు, ట్రక్కులు, ఎం16 మెషిన్ గన్స్, మందుపాతరలతో షూటింగ్ చేస్తున్నారు. పర్వతప్రాంతమైన ఎంగూరి డ్యామ్‌లో ప్రస్తుతం 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నెలకొని ఉన్నది. టాలీవుడ్ చిత్రం షూటింగ్ జరుపుకోవడం ఇదే తొలిసారి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X