»   » హృతిక్ ‘మొహంజొదారో’... ప్లాప్ కావడానికి కారణాలు ఇవే! (ఫుల్ డీటేల్స్)

హృతిక్ ‘మొహంజొదారో’... ప్లాప్ కావడానికి కారణాలు ఇవే! (ఫుల్ డీటేల్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: లగాన్, స్వదేశ్, జోధా అక్బర్ లాంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన అశుతోష్ గోవరికర్ దర్శకత్వం, హృతిక్ రోషన్ లాంటి పెద్ద బాలీవుడ్ స్టార్, ఇప్పటి వరకు ఎవ్వరూ టచ్ చేయని మొహంజొదారో చారిత్రక నేపథ్యం, వందల కోట్ల రూపాయల ఖర్చు, భారీ సెట్టింగులు, సుధీర్ఘ కాలం పాటు సాగిన షూటింగ్..... వెరసి ఇండియన్ సినిమా చరిత్రలో రాబోతున్న మరో గొప్ప సినిమాగా సినిమా రిలీజ్ ముందు వరకు ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండేవి.

భారీ అంచనాల మధ్య ఆగస్టు 12న రిలీజైన ఈ చిత్రం.... ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. వారం గడిచేలోపు సినిమా ప్లాప్ అని తేలిపోయింది. బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందని భావించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అద్భుతాలు సృష్టించడంలో పూర్తిగా విఫలం అయింది.

భారతీయులంతా చిన్న తనం నుండి పుస్తకాల్లో... హరప్పా, మొహంజోదారో కాలం నాటి సంస్కృతి గురించి చదువుకున్నారు. దీంతో 'మొహంజోదారో' పేరుతో ఆ కాలం నాటి పరిస్థితులను ఫోకస్ చేస్తూ సినిమా వస్తుందనే విషయం తెలియగానే అందరిలోనూ సినిమాపై ఆసక్తి పెరిగింది.

అయితే ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు....సినిమాలో అసలు విషయం లేక పోవడం, చారిత్రక నేపథ్యం అని చెప్పి కొరసు మాత్రమే దర్శకుడు చూపించడంతో నిరాశ తప్పలేదు. స్లైడ్ షోలో సినిమా ప్లాప్ అవ్వడానికి గల 7 ప్రధాన కారణాలు...

 ఓవర్ డ్రమటిక్ స్టోరీ

ఓవర్ డ్రమటిక్ స్టోరీ

సినిమాలో ఓవర్ డ్రమటిక్ స్టోరీ ఉండటం సినిమాను ప్రేక్షకులు తిరస్కరించడానికి ప్రధాన కారణం.

విఎఫ్ఎక్స్ సరిగా లేక పోవడం

విఎఫ్ఎక్స్ సరిగా లేక పోవడం

సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా సరిగా లేవు. ఇంత ఖర్చు పెట్టించిన దర్శకుడు ఈ విషయంలో సరైన శ్రద్ధ పెట్టక పోవడం కూడా సినిమా ప్లాప్ అవ్వడానికి మరో కారణం.

రియల్ లుక్ లేదు

రియల్ లుక్ లేదు

సినిమాలో నటీనటులకు వాడిన కాస్ట్యూమ్స్....ఆకాలం నాటి పరిస్థితులకు తగిన విధంగా లేవు. దీంతో సినిమా రియల్ లుక్ కోల్పోయినట్లయింది.

గ్రేట్ యాక్టింగ్, పూర్ స్టోరీలైన్

గ్రేట్ యాక్టింగ్, పూర్ స్టోరీలైన్

సినిమాలో నటీనటుల యాక్టింగ్ గ్రేట్ గా ఉన్నా... స్టోరీ లైన్ చాలా పూర్ గా ఉండటం కూడా సినిమా ప్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం.

అసలు విషయం లేదు

అసలు విషయం లేదు

ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణం మొహంజొదారో చరిత్ర సినిమాలో ఉంటుందని ప్రేక్షకుడు భావించడమే, కానీ సినిమాలో అలాంటిదేమీ లేక పోవడంతో అంతా నిరాశ పడ్డారు.

క్లైమాక్స్

క్లైమాక్స్

సినిమా క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా లేక పోవడం కూడా సినిమాకు పెద్ద మైనస్.

అంచనాలు భారీగా ఉండటం

అంచనాలు భారీగా ఉండటం

సినిమాపై అంచనాలు మొదటి నుండి భారీగా ఉండటం, అంచనాలను అందుకునే రేంజిలో సినిమా లేక పోవడం ప్రధాన కారణం.

English summary
A period film. Mohenjo Daro, a film by Ashutosh Gowariker, created quite a bit of hype before its release. Right from the promotional events to the trailer to the debutant beautiful heroine Pooja Hegde and to Hrithik Roshan's look, fans simply waited for its release with utter curiosity and interest.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu