»   » టాలీవుడ్ సెంటిమెంట్: ప్లాపు భయంతో అన్నీ ఒకేసారి ఇలా?

టాలీవుడ్ సెంటిమెంట్: ప్లాపు భయంతో అన్నీ ఒకేసారి ఇలా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గడిచిన వారం రోజుల్లో 7 తెలుగు సినిమాలకు సంబందించిన ట్రైలర్లు, టీజర్లు వరుసపెట్టి విడుదలయ్యాయి. వీటికి తోడు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లు అదనం.

ఒకేసారి ఇన్ని సినిమాలకు ఎందుకు వరుస కట్టాయి? అనే విషయం ఆరాతీస్తే ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వారం దాటితే మంచిరోజులు, మంచి ముహూర్తాలు లేవనే కారణంతోనే ఇలా చేశారట. ఈ సినిమాలన్నీ ఈ నెలా ఖరున, మచ్చే నెలలో విడుదలయ్యే సినిమాలే కావడం గమనార్హం. ఈ వారం రిలీజ్ చేయక పోతే మరో నెల రోజుల వరకు మంచి రోజులు లేవట.


సెంటిమెంట్లను బాగా నమ్మే సినిమా ఇండస్ట్రీ వారు..... తమ తమ సినిమాలకు అంతా మంచి జరుగాలని ఇలా చేశారట. ఈ వారం విడుదలైన ట్రైలర్లు, టీజర్లపై ఓ లుక్కేద్దాం....


నిన్నుకోరి

నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'నిన్నుకోరి'. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 7న విడుదలకు సిద్ధమవుతోంది.


ఫిదా...

వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పిదా'. ఇప్పటికే ఫస్ట్ లుక్స్ తో పాజిటివ్ ఇంప్రెషన్ పొందిన ఈ చిత్రం తాజాగా విడుదలైన టీజర్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచేలా చేసింది. నిన్న సాయంత్రం టీజర్ విడుదలవ్వగా అప్పుడే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.


గౌతమ్ నందా

మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ను చిత్ర కథానాయకుడు గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది.


శమంతకమణి

భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `శ‌మంత‌క‌మ‌ణి`. నారా రోహిత్‌, సందీప్ కిష‌న్‌, సుధీర్ బాబు, ఆది సాయికుమార్‌, డా. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఇంద్ర‌జ‌, చాందిని చౌద‌రి, అన‌న్య సోని, జెన్ని, సుమ‌న్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, క‌స్తూరి, ర‌ఘు కారుమంచి, హేమ‌, సురేఖ వాణి, గిరిధ‌ర్‌, స‌త్యం రాజేశ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమా జులై 14న విడుదల కాబోతోంది.


ఒక్కడు మిగిలాడు

మంచు మ‌నోజ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఒక్క‌డు మిగిలాడు'. ఈ చిత్రంలో మనోజ్ ఎల్‌.టి.టి.ఇ. నాయ‌కుడు ప్ర‌భాక‌ర‌న్‌గా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌న‌ప‌డబోతున్నాడు. అజ‌య్ అండ్ర్యూస్ నౌతాక్కి ద‌ర్శ‌కత్వంలో ఎస్‌.ఎన్‌.రెడ్డి, ల‌క్ష్మీకాంత్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


కథలో రాజకుమారి

నారా రోహిత్, నమిత ప్రమోద్ హీరో హీరోయిన్లుగా మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కథలో రాజకుమారి'. నాగ శౌర్య ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజైంది.


లండన్ బాబులు

ర‌క్షిత్, స్వాతి రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న చిత్రం లండ‌న్ బాబులు . ఈ చిత్రాన్ని బి. చిన్ని కృష్ణ తెర‌కెక్కిస్తుండ‌గా, మారుతి టాకీస్ బేన‌ర్ పై మారుతి ఈ మూవీని నిర్మిస్తున్నారు. త‌మిళ మూవీ ఆండ‌వ‌న్ క‌ట్టాలాయ్ మూవీకి రీమేక్ గా లండన్ బాబులు చిత్రం రూపొందుతుంది.English summary
This week has been a busy week for Tollywood fans as they witnessed a steady flow of teasers and trailers for some of the most anticipated movies flooded the youtube.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu