»   » తమ్ముడి వల్లే... 100 కోట్లు వచ్చేశాయ్, థాంక్స్ చెప్పిన కళ్యాణ్ రామ్

తమ్ముడి వల్లే... 100 కోట్లు వచ్చేశాయ్, థాంక్స్ చెప్పిన కళ్యాణ్ రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అన్న దమ్ముల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'జై లవ కుశ'. సినిమాలో ముగ్గురు అన్నదమ్ములు. నిజజీవితంలో ఎన్టీఆర్ బ్రదర్స్ కూడా ముగ్గురే. దురదృష్ట వశాత్తు జానకి రామ్ కొన్ని కొంతకాలం క్రితం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

అన్నయ్య జానకి రామ్‌ను ప్రతి సందర్భంలోనూ కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్ తలుచుకుంటూనే ఉన్నారు. అన్నయ్య ఆశీస్సులు ఉన్నాయనే గట్టి నమ్మకంతో 'జై లవ కుశ' సినిమా చేశారు. వీరి ప్రయత్నానికి పై నుండి జానకి రామ్ ఆశీస్సులు కూడా లభించడం, అభిమానుల ఆధరణ కూడా దక్కడం, వారిని సంతృప్తి పరిచేలా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపడం.... వెరసి 'జై లవ కుశ' బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.


ఆశ్చర్యపోయిన ట్రేడ్ పండితులు

ఆశ్చర్యపోయిన ట్రేడ్ పండితులు

‘జై లవ కుశ' సినిమా భారీ విజయం సాధిస్తుందని ముందు నుండి అందరినలోనూ ఓ నమ్మకం ఉంది. జై టీజర్ రిలీజ్ తర్వాత అది మరింత పెరిగింది. కానీ వారంలోపే రూ. 100 కోట్లు వసూలు చేస్తుందని ఎవరూ ఊహించలేదు.


అఫీషియల్‌గా ప్రకటించిన కళ్యాణ్ రామ్

అఫీషియల్‌గా ప్రకటించిన కళ్యాణ్ రామ్

తమ సినిమా ప్రపంచం వ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది అంటూ చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ అఫీషియల్ గా ప్రకటించారు.అందరికీ థాంక్స్

అందరికీ థాంక్స్

‘జై లవ కుశ' చిత్రానికి అఖండ విజయాన్ని సాధించి పెట్టిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ఫిల్మ్ లవర్స్‌కు కళ్యాణ్ రామ్ థాంక్స్ చెప్పారు.బాక్సాఫీసు వద్ద జోరు

బాక్సాఫీసు వద్ద జోరు

‘జై లవ కుశ' సినిమా జోరు బాక్సాఫీసు వద్ద మామూలుగా లేదు. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 75 కోట్లు వసూలవ్వగా, ఐదు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ సాధించింది.భారీ లాభాలు

భారీ లాభాలు

ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 10 సినిమాలు నిర్మించారు. అయితే సక్సస్ అయిన సినిమాలు తక్కువే. ఆ లోటను పూడ్చేలా ‘జై లవ కుశ' మూవీ భారీ లాభాలు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.


English summary
"Jai Lava Kusa movie collected Rs. 100 cr gross. A big thanks to Telugu Film lovers across the world for this massive success." Kalyan Ram tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu