For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్మ కొత్త పుస్తకం 'వోడ్కా విత్ వర్మ' డిటేల్స్

By Srikanya
|

హైదరాబాద్: వర్మ రచించిన నా ఇష్టం పుస్తకం ఆ మధ్యన వచ్చి ఎంత సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు వర్మ ఆలోచనలతో మరో పుస్తకం రాబోతోంది. దానిపేరు 'వోడ్కా విత్ వర్మ'. వర్మ రాసిన ట్వీట్స్ అన్ని కంపెల్ చేసి,తెలుగులోకి అనువదించి ఈ పుస్తకం తెలుగులోకి విడుదల చేస్తున్నారు. వర్మ రాత్రి పది దాటాక వోడ్కా తాగుతూ ట్వీట్స్ చేస్తూంటారని, ఆ ట్వీట్స్ ని కంపెల్ చేసిన పుస్తకం కాబట్టి దానికి ఈ టైటిల్ పెట్టామని చెప్తున్నారు.

ఇక ఈ పుస్తకాన్ని పాటల రచయిత సిరాశ్రీ రాసారు. సిరాశ్రీ ఈ విషయమై మాట్లాడుతూ...కొందరు వర్మని పిచ్చివాడు అంటారు. మరికొందరు జీనియస్ అంటారు. ఎవరి ఏమన్నా,ఆయన్ని మర్చిపోవటం కష్టం. ముఖ్యంగా ఆయన్ని ట్విట్టర్ లో ఫాలో కావటం మానలేం అని రాసారు. ఇక ఈ పుస్తకానికి పూరి జగన్నాధ్ ముందు మాట రాసారు. అలాగే చివర్లో వర్మ ఈ పుస్తకాన్ని జస్టిఫై చేస్తూ చివరి మాట రాసారు. ఇందులో ఇంకా కొందరు సెలబ్రేటీల ఇంటర్వూలు కూడా ఉన్నాయి. నా ఇష్టం లాగానే ఈ పుస్తకం కూడా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం వర్మ తన తాజా చిత్రం బూచి ప్రమోషన్ లో ఉన్నారు. గతంలో తాను రూపొందించిన 'భూత్'కు సీక్వెల్‌గా 'భూత్ రిటర్న్స్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. 3డి ఫార్మాట్‌లో దీన్ని రూపొందించారు. అలుంబ్రా ఎంటర్ టైన్మెంట్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించగా...ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వారు ఈ చిత్రాన్ని విడుదచేస్తున్నారు. రామ్ గోపాల్ కెరీర్లోనే ఇది ఫస్ట్ 3డి సినిమా.

ఈ చిత్రాన్ని తెలుగులో 'బూచి' పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన అనువాదన కార్యక్రమాలు మొదలు కానున్నాయి. 'భూత్ రిటర్న్' చిత్రం అక్టోబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తెలుగు 'బూచి' టైటిల్‌తో రిలీజ్ చేయనున్న ఈచిత్రాన్ని మాత్రం అక్టోబర్ 26న విడుదల చేయనున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి కానందునే ఈ చిత్రాన్ని తెలుగులో కాస్త లేటుగా విడుదల చేయబోతున్నారు.

నిన్నటి తరం కథానాయిక మనీషా కోయిరాలా ఇందులో తల్లి పాత్ర పోషించగా, ఆరేళ్ళ అలయ్న అనే పాప కీలక పాత్ర పోషించింది. ఈ కథ వీరిద్దరి చుట్టూ తిరుగుతుంది కాబట్టి, వీరిద్దరే ఈ సినిమాలో ఎక్కువగా కనిపిస్తారు. జేడీ చక్రవర్తి మరో పాత్రలో కనిపించనున్నాడు. 'భూత్ రిటర్న్స్ హర్రర్ మూవీ. బూత్ సినిమా మిమ్మల్ని భయపెడితే.., భూత్ రిటర్న్స్ మిమ్మల్ని చంపేస్తుంది' అని అంటున్నాడు వర్మ. వివాదాలతో చేసిన ప్రయోగాలూ కాసులు రాల్చవనే ఉద్దేశానికి వచ్చి తిరిగి తన పాత ఫార్ములానే నెత్తి కెత్తు కుంటున్న వర్మ ఈ సినిమాతో ఎంత వరకు సఫలీకృతం అవుతాడో వేచి చూడాలి.

English summary
Sira Sri has compiled RGV's e tweets and is bringing out a book titled Vodka with Varma on RGV's tweets. Apart from these tweets this book will also have interviews of celebs. The foreword for this book has been written by Puri Jagannadh. RGV has also justified his tweets by writing the end word with the last peg of vodka.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more