»   » కూతురు ఫస్ట్ లవ్, చిరకాల హీరో.... అల్లు అర్జున్ పోస్టు ఆసక్తికరం!

కూతురు ఫస్ట్ లవ్, చిరకాల హీరో.... అల్లు అర్జున్ పోస్టు ఆసక్తికరం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో హాట్ టాపిక్ అయింది. ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు... బన్నీ ముద్దుల కూతురు అర్హ. కూతురుతో ఆనందంగా గడుపుతున్న క్షణాలకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియా లక్షలాది లైక్స్‌తో సంచలనం అయింది.

బన్నీ తన కూతురుతో ఆనందంగా గడుపుతున్న క్షణాలను ఓ ఫోటోగ్రాఫర్ ఎంతో అందంగా తన కెమెరాలో బంధించాడు. ఈ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్న బన్నీ 'కుమార్తెకు ఆమె తండ్రి మొదటి ప్రేమికుడు. చిరకాల హీరో' అనే క్యాప్షన్ పెట్టారు.

అల్లు అర్జున్-అర్హ

ఏ తండ్రికైనా కూతురే యువరాణి. వారు ఎదుగుతున్న క్షణాలను చూస్తున్నపుడు తండ్రి పొందే ఆనందం వెలకట్టలేనిది. అలాంటి ఆనందమే ఈ ఫోటోలో బన్నీ మొహంలో కనిపిస్తోంది.

అల్లు అర్హ

అల్లు అర్హ

2016 నవంబర్ 21న అల్లు అర్జున్, స్నేహ దంపతులు అర్హకు జన్మనిచ్చారు. తమ ముద్దుల కూతురికి అర్జున్ (arjun), స్నేహ (sneha)ల ఇంగ్లీష్ పేర్లలోనిమొదటి, చివరి అక్షరాలు ar, ha కలుపుతూ అర్హ (arha) అన్న పేరు పెట్టారు.

అర్హం అంటే

అర్హం అంటే

హిందూ సంప్రదాయా ల ప్రకారం అర్హ అంటే మహా శివుడి పేరు అన్న అర్థం వస్తుందట. అదేవిధంగా ఇస్లామిక్‌లో అర్హ అంటే ప్రశాంతమైన అని మరో అర్థం ఉందట. ఇలా చాలా ఆలోచించి... అల్లు అర్జున్ తన కూతురికి పేరు పెట్టడం విశేషం.

Allu Arjun Single Or Dual Roles In DJ ? @ DJ Promotions| Filmibeat Telugu
త్వరలో ఫస్ట్ బర్త్ డే

త్వరలో ఫస్ట్ బర్త్ డే

మరో మూడు నెలల్లో అర్హ ఫస్ట్ బర్త్ డే రాబోతోంది. తన ప్రియమైన కూతురు మొదటి బర్త్ డేను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారట. ఈ బర్త్ డే ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవాలా? లేక విదేశాల్లో చేయాలా? ఇలా రకరకాల ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

English summary
"A Dad is a daughter's first love and forever hero" Allu Arjun shared a pic with this caption.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu