»   »  తెరపై సానియా మీర్జా ?

తెరపై సానియా మీర్జా ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sania Mirza
బాలీవుడ్ లో గత కొంత కాలంగా స్పోర్ట్స్ సినిమాల హవా కొనసాగుతోంది . అంతేగాక రియల్ లైఫ్ స్టోరీస్ అంటే మరీ మోజు చూపిస్తున్నారు. తాజాగా ఈ రెండు అంశాలు కలసి వచ్చేలా ప్రముఖ టెన్నీస్ తార సానియా మీర్జా రియల్ లైఫ్ ఆధారంగా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దాని టైటిల్ 'ఐ ఫర్ ఇండియా' అని రిజిస్టర్ చేసారట. అంబ్లెళ్ళా ఫిలిమ్స్ అథినేత దీపక్ ఆర్ గాంధి ఈ సినిమాను డిస్టిన్ట్ హారిజని ఫిలిమ్స్ (లాస్ యాంజెల్స్ బేసడ్) వారితో కలిసి నిర్మించాలని నిర్ణయించుకున్నారట. ఈ భారీ ప్రాజెక్టును హేమంత్ దాస్ డైరక్ట్ చేస్తారట. సానియా మీర్జా స్పోర్ట్స్ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలకు తీసుకుని వాటికి కొంత డ్రామా జోడించి తీయాలని స్క్రిఫ్టు రెడీ చేస్తున్నారట. మరో ప్రక్క ఈ కథ సానియా మీర్జా ఒక్కరిదే కాదు ఎదుగుదల కోరుకునే ప్రతీ ఆటగాడి కథ ఇది...అని దర్శక నిర్మాతలు తెలివిగా యో కాంట్రావర్సీ లేకుండా చెప్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X