»   » ప్లాప్ ఫిల్మ్ మానసికంగా కుంగదీస్తుంది: అభిషేక్

ప్లాప్ ఫిల్మ్ మానసికంగా కుంగదీస్తుంది: అభిషేక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో ప్లాప్ హీరోగా ముద్ర పడ్డ అభిషేక్ బచ్చన్..... ప్లాప్ సినిమా అనుభవం ఎలా ఉంటేందో వెల్లడించారు. ప్రతి సినిమా కష్టపడి చేస్తాం, కష్టానికి తగ్గ ఫలితం లభించకపోతే తట్టుకోవడం కష్టం అన్నారు. బాక్సాఫీస్ దగ్గర సినిమా వైఫల్యం చెందితే తీవ్రంగా బాధిస్తుందని అభిషేక్ బచ్చన్ చెప్పుకొచ్చారు.

సినిమా ఫెయిల్ అయితే ప్రేక్షకులు మన గురించి పట్టించుకోవడం మానేస్తారు.... నేను ఓ సెలబ్రిటీ కొడుకునే అనే విషయాలు అక్కడ పని చేయవు. తరువాత ప్రపంచం మొఖం చూడాలంటే ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నాడు. ఆ ఫలితం మనిషిలోని అంతర్గత సామర్ధ్యాన్ని కుంగదీస్తుందని అభిషేక్ అభిప్రాయపడ్డాడు. వైఫల్యానికి కారణాలు వెతికే కన్నా ఫలితాన్ని శిరసావహించడమే మేలని అభిషేక్ తెలిపాడు.

 Abhishek Bachchan

ప్రస్తుతం అభిషేక్ బచ్చన్... ఉమేష్ శుక్లా దర్శకత్వంలో ‘ఆల్ ఈజ్ వెల్' చిత్రంలో నటిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ సరసన అసిన్ హీరోయిన్ గా నటిస్తోంది. రిషి కపూర్, ప్రియాంక పాతక్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఉమేష్ శుక్లా గత సినిమా ‘ఓ మై గాడ్' తరహాలోనే ‘ఆల్ ఈజ్ వెల్' ఒక సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతోంది.

ఈ సినిమాను భూషణ కుమార్, కిష్ కుమార్, శ్యాం బజాజ్, వరుణ్ బజాన్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 21న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు.

Please Wait while comments are loading...