»   »  ఇద్దరి భర్తల ముద్దుల హీరోయిన్

ఇద్దరి భర్తల ముద్దుల హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mittaai
తమిళంలో తాజాగా మిట్టై అనే చిత్రం పోస్టర్స్ వార్తల్లో నిలిచాయి. ఆ పోస్టర్స్ లో హీరోయిన్ ఇద్దరి భర్తలని పెళ్లి చేసుకుని దండలతో కలసి ఉంటుంది. ఇక ఈ విషయం గురించి దర్శకుడు ఎమ్.ఎస్.అంబు మాట్లాడుతూ ఈ చిత్రం క్లైమాక్స్ లో ఈ హీరోలిద్దరిలో ఎవరిని పెళ్ళి చేసుకోవాలనే ప్రసక్తి వస్తుందిట.

అందుకే సింబాలిక్ గా ఆమె మనస్సులో మాటని అలా పోస్టర్స్ లో వేసారుట. అలాగే ఈ చిత్రం క్లైమాక్స్ లో ఎవరిని పెళ్ళి చేసుకుంటుందనేది రాసి పంపిన వారికి లక్షరూపాయలు గిప్ట్ ఇవ్వటం జరుగుతుందని తెలుపుతున్నారు. అంతేగాక ఈలోగా ఓ యాభై మందిని ఎంపిక చేసి దాదాపు ముప్పావు వంతు సినిమా చూపించి వారిని క్లైమాక్స్ కనుక్కోమంటామని చెపుతున్నారు. ఫ్రీ పబ్లిసిటీ కోసం భలే ప్లాన్ చేస్తున్నాడు కదా ...అని చెన్నై వాసులు ఆశ్చర్యపోతున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X