»   » ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లో ఈ సీన్ కు సూపర్ రెస్పాన్స్..ధియోటర్స్ దద్దరిల్లుతున్నాయి

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లో ఈ సీన్ కు సూపర్ రెస్పాన్స్..ధియోటర్స్ దద్దరిల్లుతున్నాయి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అఖండ భారతదేశాన్ని పరిపాలించిన ఏకైక చక్రవర్తి "శాతకర్ణి" జీవితం ఆధారంగా తెరకెక్కిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి" భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది..సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సినిమాలో డైలాగులుకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఒక సీన్ కు మాత్రం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్ సీన్ లోనూ ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. ఆ సీన్ ఏమిటంటే...


కథలో భాగంగా ...ఉత్తరభారతాన్ని పరిపాలించే రాజు నహపాణుడిపైకి శాతకర్ణి యుద్ధానికి వెళ్తాడు. ఆ సమయంలో శాతకర్ణి కుమారుడు పులోమావిని నహపాణుడు బందిస్తాడు. ఆ పిల్లాడి మెడపై కత్తిపెట్టి శాతకర్ణిని సామంతుడిగా మారుతావా బాలుడిని చంపమంటావా.. సమయం లేదు మిత్రమా అంటూ శాతకర్ణికి సవాల్‌ విసురుతాడు. అందరూ చాలా ఆసక్తిగా ఉత్కంటగా ఎదురుచూస్తున్న క్షణం అది.

A highlight scene Gautamiputra Satakarni scene

కొడుకు మీద ప్రేమతో .. వేరే దారిలేక శాతకర్ణి లొంగిపోతాడు అని సగటు ప్రేక్షకుడు భావిస్తాడు. కానీ ఈలోగా... శాతకర్ణి... కొదమ సింహంలాగా గుర్రంపై నుంచి దూకుతూనే ఓ సైనికుడి చేతిలోని డాలును అందుకొని విసురుతాడు. అది ఆ బాలుడి మెడపై కత్తి పెట్టిన వాడి తలను తెంపేస్తుంది. ఆ లోగానే నహపాణుడిని తన ఆదీనంలోకి తీసుకుంటాడు శాతకర్ణి. ఈ సీన్‌లో బాలకృష్ణ చూపించిన విశ్వరూపానికి థియేటర్లు హోరెత్తిపోతున్నాయి.


ఇక చిత్రం టాక్ ఎలా ఉందంటే..శాతకర్ణిగా బాలకృష్ణ గ్రాండ్ ఎంట్రీ అదిరిపోయింది...బాలయ్య ఎంట్రీ తో థియేటర్స్ దద్దరిల్లింది ..అలాగే యుద్ధసన్నివేశం లో మొదలైన ఫస్ ఫైట్ లో విజువల్స్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. యుద్ధ ఫైట్ తర్వాత శాతకర్ణి భార్య వశిష్టి దేవిగా శ్రియ చాల అందంగా కనిపించింది..శ్రీయ - బాలకృష్ణ ల మధ్య వచ్చే ఏకిమీడా రొమాంటిక్ సాంగ్ అదిరిపోయింది.

ఇక ఈ చిత్రం కథా, కథనం ఆకట్టుకునేలా డిజైన్ చేసారు క్రిష్. ముఖ్యంగా బుర్రా సాయిమాధవ్‌ రాసిన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా చెప్తున్నారు. శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయాడని.. యుద్ధ సన్నివేశాలు చాలా రిచ్‌గా తెరకెక్కించారని అంటున్నారు. చిత్రంలోని ఎమోషన్స్ ఆయా సన్నివేశాలకు మరింత బలాన్నిచ్చాయి. ఇక విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు వస్తున్నాయి. డైరక్టర్ గా క్రిష్‌ మరో మెట్టు ఎక్కారని, టేకింగ్‌, కథనం నడిపిన తీరు చాలా బాగుందంటున్నారు.

శాతకర్ణి జీవితం బుర్ర కథ చెప్పే పాత్రలో కన్నడ సూపర్ స్టార్ రాజ్‌కుమార్ కనిపించి అలరించారు. గ్రీకు రాజు నహాపనతో శాతకర్ణి చేసే యుద్ధం సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ అంత యుద్దాలు , గ్రాఫిక్స్ తో ఆకట్టుకుంది...బాలయ్య పోరాట సన్నివేశాలను అభిమానులు ఎంజాయ్ చేసారు..ఇక సెకండ్ హాఫ్ కూడా ఆకట్టుకునే రీతిలో ఉంది. శ్రియ, హేమ మాలిని పాత్రలు చాలా స్ట్రాంగ్ గా ఉండి కథకు కలిసివచ్చేలా సాగాయి. సాహో శాతకర్ణి అంటున్నారు.

English summary
Nandamuri Balakrishna's most anticipated epic drama Gautamiputra Satakarni (Gautami Putra Satakarni/GPSK), released on Thursday, January 12, has opened to tremendous response from movie-goers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu