twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జునపై మహిళా జర్నలిస్టు ఫిర్యాదు

    By Srikanya
    |

    హీరో నాగార్జునపై ఫ్రీలాన్స్‌ మహిళా జర్నలిస్టు సునీతాచౌదరి జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రిపోర్టర్‌ ఫిర్యాదు మేరకు 506, 509 సెక్షన్లలో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. సునీతాచౌదరి సెన్సార్‌బోర్డ్‌ మెంబర్‌గా పని చేస్తున్నారు. నాగార్జున తనను అసభ్యపదజాలంతో దూషించి, బెదిరింపులకు గురి చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. సునీతా చౌదరి ది హిందూ పత్రికకు ఫ్రీ జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు. అలాగే సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. నాలుగు రోజుల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఢమరుకం ప్రెస్ మీట్ కు అందరూ రిపోర్టర్లతో కలిసి ఈమె కూడా హాజరయ్యారు.

    అక్కడ హీరో నాగార్జున సునీత చౌదరి ని ప్రత్యేకంగా పిలిచి బెదిరించారని, తీవ్రమైన పదజాలంతో, చెప్పలేని బాషలో దూషించారని అభియోగం. నాగార్జున విగ్ పెట్టుకుని నటిస్తున్నారని నాలుగేళ్ల క్రితం సునీత ఓ ఆర్టికల్ రాసారని, అది మనసులో పెట్టుకొని నాగార్జున దూషించారని ఆమె కంప్లైంట్ లో పేర్కొన్నారు.ఇక ఐ.పి.సి 509( అసభ్య పద జాలంతో దూషించడం), 506 (తీవ్రంగా బెదిరించడం ) సెక్షన్ల కింద ఈ కేసు నమోదు అయ్యింది.పోలీసులు ధర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

    English summary
    Nagarjuna was on Saturday booked on charges of abusing a woman journalist and for criminal intimidation, police said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X