»   » గ్రేట్ :తెలుగులో 'కనుపాప' టైటిల్ తో రిలీజ్ కు వెయిటింగ్...కన్నడంలో శివరాజ్ కుమార్ తో రీమేక్

గ్రేట్ :తెలుగులో 'కనుపాప' టైటిల్ తో రిలీజ్ కు వెయిటింగ్...కన్నడంలో శివరాజ్ కుమార్ తో రీమేక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పుడు కేవలం టాలీవుడ్ లోనూ అన్ని రీజనల్ లాంగ్వేజెస్ లోనూ మోహన్ లాల్ హవా ప్రారంభమైంది. ఊహించని విధంగా ఆయన క్రేజ్ మళ్లీ చాలా కాలం తర్వాత స్టార్టైంది. వరస హిట్స్ తో ఆయన సినిమాలకు ట్రేడ్ సర్కిల్స్ లో డిమాండ్ ఏర్పడింది. ఆయన సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. మినిమం గ్యారెంటీగా సినిమా ఉంటుందని నమ్మి మోహన్ లాల్ బ్రాండ్ పై డబ్బు పెట్టడానికి సిద్దపడుతున్నారు. అంతేకాదు ఆయన హిట్ సినిమాలను రీమేక్ చేయటానికి ,డబ్ చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

తెలుగులో మోహన్ లాల్ హవా మొదలైందనుకుంటే ఇప్పుడు కన్నడంలోనూ మోహన్ లాల్ చిత్రాలకు డిమాండ్ ఏర్పడుతోంది. అందుకు నిదర్శనం..ఆయన రీసెంట్ సూపర్ హిట్ ఒప్పం చిత్రాన్ని కన్నడంలో రీమేక్ కు ప్లానింగ్ చేయటమే. అదీ కన్నడ పవర్ స్టార్ శివన్న (శివరాజ్ కుమార్ ) తో కావటం విశేషం.

2017లో శివరాజ్ కుమార్ చేయబోయే చిత్రాల లిస్ట్ లో ఒప్పం రీమేక్ చేరుకుంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర పని చేసిన జివిఆర్ వాసు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.రామ్ గోపాల్ వర్మ వద్ద మూడు సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసిన అనుభవంతో ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నట్లు వాసు తెలియచేసారు. కిల్లింగ్ వీరప్పన్ సమయంలో శివన్నతో ఇంటరాక్షన్ ఏర్పడిందని, ఆ పరిచయం తనకు సినిమాను డైరక్ట్ చేయటానికి అవకాసం ఇప్పించిందని చెప్పారు.

A new director to helm Shivanna's Oppam's remake


తెలుగులో ఒప్పం విషయానికి వస్తే...

ఎన్టీఆర్ తో చేసిన జనతా గ్యారేజ్, యేలేటి 'మనమంతా', రీసెంట్ గా విడుదలైన 'మన్యం పులి' (పులి మురగన్ డబ్బింగ్ )చిత్రాలతో లాల్ హ‌వా మ‌ళ్లీ టాలీవుడ్‌లో మొద‌లైంది. చాలా గ్యాప్ త‌ర్వాత ఒకే ఏడాదిలో మూడు సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డం అంటే గ్రేట్. ప్ర‌స్తుతం ఇదే పాజిటివ్ టాక్ మోహ‌న్‌లాల్‌కి బాగా క‌లిసొస్తోంది. ఈ హుషారులోనే .. లాల్ న‌టించిన సినిమాల‌న్నీ టాలీవుడ్‌లో క్యూ క‌ట్టేస్తున్నాయి.

అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం ఏఎన్నార్, బాలకృష్ణల 'గాడీవం' చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన ఆయన మళ్ళీ ఈ 2106 లోనే తెలుగు ప్రేక్షకులకు దర్శనమిచ్చాడు. తెలుగు వాళ్ళు కూడా ఆయన్ను బాగానే రిసీవ్ చేసుకున్నారు. 'జనతా గ్యారేజ్' చిత్రంలో ఆయన పాత్రకు మంచి ఆదరణ దక్కగా ఆయన సోలోగా చేసిన 'మనమంతా', రీసెంట్ గా విడుదలైన 'మన్యం పులి' చిత్రాలు మంచి సినిమాలనే టాక్ తెచ్చుకుని డబ్బులు తెచ్చిపెడుతున్నాయి.

ఆ స్పీడులో మోహ‌న్‌లాల్ న‌టించి మ‌ల‌యాళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన ఒప్పం సినిమాని క‌నుపాప‌ పేరుతో తెలుగైజ్ చేసేస్తున్నారు. ఓ పాప‌, చూపులేని వ్య‌క్తి, ఓ హ‌త్య కేసు చుట్టూ ఇంట్రెస్టింగ్ ట్విస్టుల‌తో సాగే ఈ సినిమా తెలుగువారిని మెప్పిస్తుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. త్వరలో రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రానికి బిజినెస్ సర్కిల్ లో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యిందని సమాచారం.

ఇప్పటికే ఈ సినిమాకు సంభందించి క్రేజీ ఆఫర్స్ తో డిస్ట్రిబ్యూటర్స్ సందడి చేస్తున్నట్లు ట్రేడ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ముఖ్యంగా ఒప్పం చిత్రం మళయాళంలో ఘన విజయం సాధించటం, ప్రియదర్శన్ కాంబినేషన్ కావటం, మోహన్ లాల్ నటన, సినిమా లో పాప సెంటిమెంట్ , యాక్షన్ ఎపిసోడ్స్ , ధ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాపై ఇంట్రస్ట్ ని పెంచేస్తున్నాయి. తెలుగులో ఒప్పం డబ్బింగ్ వెర్షన్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

మోహన్ లాల్ , సముతిరాకని, అనుశ్రీ, విమలారామన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం 'ఒప్పం'. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొంది రిలీజైన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 8న విడుదలైన ఈ చిత్రం మొదటి 15 రోజుల్లోనే 23.7 కోట్లు గ్రాస్ వసూలు చేసి , మళయాళ సూపర్ హిట్ మూవి ప్రేమమ్ రికార్డ్ ని క్రాస్ చేసింది. ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్ సీస్ నెట్ వర్క్ ఎంటర్టైన్మెంట్స్ బి.దిలీప్ కుమార్ తో కలిసి మోహన్ లాల్ ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
The remake of a Malayalam film Oppam in Kananda is among the list of films Shivarajkumar has lined up for 2017, and it is GVR Vasu's debut as a director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu