»   » ‘రంగస్థలం’లో పొలిటికల్ మసాలా, ఈ పోస్టర్లే సాక్ష్యం...

‘రంగస్థలం’లో పొలిటికల్ మసాలా, ఈ పోస్టర్లే సాక్ష్యం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగస్థలం' సినిమాలో పొలిటికల్ మసాలా కూడా ఉండబోతోందా? సినిమాలో ప్రెసిడెంట్ ఎలక్షన్ల ఘట్టం కీలకంగా ఉండబోతోందా? అంటే అవుననే అంటున్నారు. తాజాగా లీక్ అయిన కొన్ని ఫోటోలు చూస్తే ఇది నిజం అని నమ్మక తప్పదు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ సోదరుడి పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. అతడు రంగస్థలం గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తారని, అప్పటికే ఆ ఊరిలో చక్రం తిప్పుతున్న ప్రెసిడెంట్(జగపతి బాబు)పై పోటీకి నిలబడతారని స్పష్టమవుతోంది.


తాజాగా విడుదలైన కొన్ని ఫోటోలను పరిశీలిస్తే ఆది పినిశెట్టి కె.కుమార్ బాబు పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో అతడు లాంతరు గుర్తుపై పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.


A photo leaked from Rangasthalam sets

విలేజ్ డ్రామా నేపథ్యాన్ని దర్శకుడు సుకుమార్ ఆసక్తికరంగా తెరకెక్కించారని, ప్రస్తుతం వస్తున్న రోటీన్ సినిమాలకు భిన్నంగా 'రంగస్థలం' ఉండబోతోందని అంటున్నారు. దీంతో మార్చి 30న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.


ఈ చిత్రంలో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో కనిపించబోతున్నారు. చిట్టి బాబు ప్రియురాలు రామ లక్ష్మి పాత్రను సమంత పోషించింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

English summary
A photo has leaked from "Rangasthalam" sets. Showcasing a poster of hero Aadhi where he's seen requesting votes. The poster reads, "K Kumar Babu, candidate for president, Vote for Lantaru symbol".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu