twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కడలి' సంగీతం ప్రత్యేకత గురించి ఎ.ఆర్.రహమాన్

    By Srikanya
    |

    చెన్నై: మణిరత్నం తాజా చిత్రం 'కడలి' . 'కడలి' చిత్రానికి రహమాన్ సంగీతం అందించారు. మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం కావటం,ప్రేమ కథ కావటం,రహమాన్ సంగీతం అందించటం వంటి అంశాలు ఈ చిత్రంపై ప్రేక్షకుల అంచనాలును పెంచేస్తున్నాయి. దానికి తోడు ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా ఇటీవల ఎ.ఆర్‌.రెహమాన్‌ మీడియాతో ఈ చిత్రం గురించి మాట్లాడారు.

    ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.... 'కడలి' సినిమా క్రిస్టియన్‌ మత్స్యకార యువకుడి నేపథ్యంలో సాగే కథ. ఈ చిత్రం కోసం అమెరికా చర్చిల్లో వినిపించే గాస్పెల్‌ సంగీతానికి మన శైలి జానపదాన్ని జతచేసి సంగీతం సమకూర్చాను. మణిరత్నం నా గురువు. ఆయన చెప్పే కథలోనే వైవిధ్యం కనిపిస్తుంటుంది. అలాగే ఆయన తనకేం కావాలో అడుగుతారు. అలాగే నేనేం చెప్పినా వింటారు. ఆయనతో పనిచేసిన ప్రతిసారీ కొత్తగానే అనిపిస్తుంటుంది. మా ఇద్దరికీ సంతృప్తి లభించే వరకు మేం కష్టపడుతుంటాం అన్నారు.

    అలాగే... మణిరత్నం, మీరు కలిసి చేసిన సినిమాలు సంగీతపరంగా చక్కటి విజయాన్ని అందుకొంటాయి కారణమేమిటి? అని చాలా మంది అడుగుతుంటారు. తరచుగా నన్ను ఆలోచింపజేసే ప్రశ్న ఇది. కథలో సున్నితత్వాన్ని ఒకేలా అర్థం చేసుకోవడంతోనే ఇలాంటి సంగీతం సమకూరుతుంటుందేమో అని నా అభిప్రాయం అని అన్నారు.

    మణిరత్నం, మనోహర్ ప్రసాద్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంచు లక్ష్మీ ప్రసన్న, యాక్షన్ స్టార్ అర్జున్. అరవింద్ స్వామి కీ రోల్ లో చేస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ హైలెట్ అని చెప్తున్నారు. జెమిని ఫిల్మ్ సర్క్కూట్ వారు ఈ చిత్రాన్ని రికార్డు స్థాయి ధర చెల్లించి థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ చిత్రం మద్రాసు టాకీస్ పతాకంపై రూపొందుతున్న 14వ చిత్రం. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 23వ చిత్రం కావడం విశేషం.

    English summary
    Kadali is an upcoming romantic thriller film directed and co-produced by Mani Ratnam. The film features debutantes Gautham Karthik, son of actor Karthik, and Thulasi Nair, daughter of Radha, in the lead roles. Kadal marks comeback of actor Arvind Swamy. The music and background score for the film is done by A. R. Rahman. The film revolves around life of Christian fishermen who instill the fact that how faith can sometimes lead to the triumph of humanity. The film will be dubbed and released simultaneously in Telugu as Kadali.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X