twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా ఇద్దరి జీవితాల విషాదమూ ఒకటే: రెహమాన్ ఉద్వేగ ప్రసంగం

    |

    ఫుట్‌బాల్‌ దిగ్గజం గా అభిమానులు పిలుచుకునే ఆటగాడు పీలే జీవితానికి నా జీవితానికి చాలా దగ్గర పోలికలున్నాయి. నా తండ్రి ఎప్పుడూ ఇతరులకు సాయం చేస్తూ ఉండేవారు. కష్టపడి పని చేస్తూనే ఆయన కన్నుమూశారు. ఈ చిత్రంలో పీలే తండ్రి కూడా ఫుట్‌బాల్‌ ఆటగాడిగా పేరు తెచ్చుకోవాలని ఎంతో కృషి చేస్తాడు. కానీ సాధించలేకపోతాడు" అంటు ఉద్వేగంగా చెప్పాడు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏ.ఆర్‌.రెహ్మాన్‌.

    ప్రముఖ సాకర్‌ ప్లేయర్ పీలే జీవిత కథ ఆధారంగా జిమ్‌ బెయిలిస్ట్‌ రూపొందిస్తున్న 'పీలే' చిత్రానికి రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈచిత్రానికి సంబంధించి ట్రైలర్‌, ఆడియో విడుదల వేడుకలో రెహ్మాన్‌ మాట్లాడుతూ.., 'పీలే తండ్రికథ అయినా, నా తండ్రి కథ అయినా ఏదో సాధించాలనుకునే తండ్రుల జీవితాలకు అద్దం పడతాయి.

    వారి జీవిత కాలంలో వాస్తవ రూపం దాల్చని వారి కలలను, వారి పిల్లలు సాకారం చేయగలరని చెప్పడానికి తమ జీవితాలే ప్రత్యక్ష ఉదాహరణ. పీలే తండ్రి అభిలాష, దీవెనలు పీలేను సాకర్‌లో సూపర్‌స్టార్‌ చేశాయి. ఇది నా జీవితానికి కూడా చాలా దగ్గరగా ఉండే అంశం' అని అన్నారు.

    A.R. Rahman on Monday launched the trailer of Pele: Birth of a Legend Football player Pele's life

    మ్యూజిక్‌ కంపోజర్‌గా పలు చిత్రాలకు పని చేసిన రెహ్మాన్‌ తండ్రి ఆశించిన విజయాలు సాధించకుండానే, పిన్న వయసులోనే అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటికీ రెహ్మాన్‌ వయసు కేవలం తొమ్మిదేండ్లు మాత్రమే.ఏఆర్ రెహ్మాన్(అల్లారఖారెహ్మాన్) మనందరికీ సుపరిచితుడే. అతనో సంగీత దర్శకుడు అతని అసలు పేరు ఏఎస్. దిలీప్ కుమార్.

    తనకు తన సంగీత ప్రపంచంలో ఆదిగురువు తన తండ్రే కావడం గమనార్హం. తను తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే తండ్రిని కోల్పోవాల్సిరావడం చాలా దురదృష్టకరం. తన తండ్రి వదిలి వెళ్లిన సంగీత పరికరాలను అద్దెకు ఇచ్చి, వచ్చే ఆ ఆదాయమే వారి కుటుంబానికి అండగా నిలిచింది.

    అతి చిన్న వయసులోనే తన తండ్రి నేర్పించిన కీ-బోర్డుతో అమాయకమైన ముఖంతో అవకాశాలకోసం, కుటుంబ పోషణ కోసం చెన్నైలోని సినిమా స్టూడియోలవెంట కాళ్ళరిగేలా తిరిగాడు. ప్రారంభంలో నాలుగవ కీ బోర్డు ప్లేయరుగా, ఆ తర్వాత మూడవ కీబోర్డు ప్లేయరుగా...అలా అలా ఎదిగి ఎన్నో విజయాలను కైవసం చేసుకున్నాడు.

    రెహ్మాన్‌ సంగీతం అందించిన బ్రెజిల్ పుట్ బాల్ దిగ్గజం పీలే పీలే జీవిత కథ ఆధారంగా రూపొందిన 'పీలే' చిత్రాన్ని ఈనెల 13న హాలీవుడ్‌లో విడుదల చేయనున్నారు.ఫుట్ బాల్ ప్రపంచ కప్ టైటిళ్లను మూడు సార్లు గెలుచుకున్న అరుదైన ఆటగాడిగా పీలే రికార్డు సృష్టించారు.

    English summary
    A.R. Rahman, who is composing the music for Pele biopic, says the opportunity is a big honour and meeting Brazilian football legend was a "dream come true".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X