»   » ఏఆర్ రెహమాన్‌కు మరో అవార్డు పురస్కారం...

ఏఆర్ రెహమాన్‌కు మరో అవార్డు పురస్కారం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ ను మరో అవార్డు వరించింది. ప్రతి ఏడాది ‘పద్మశ్రీ పండిత్ హృదయనాధ్ మంగేష్కర్' పేరిట బహూకరించే అవార్డుకు ఈ సారి ఏఆర్ రెహహాన్ అందుకోబోతున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాత సుభాష్ ఘాయ్ ప్రతి ఏడాది హృదయనాథ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా రంగంలోని ప్రముఖులకు గత నాలుగేళ్లుగా అవార్డు బహూకరిస్తూ వస్తున్నారు.

A R Rahman to Receive Hridaynath Mangeshkar Award

ఇప్పటి వరకు ఈ అవార్డులు లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, అమితాబ్ బచ్చన్, సులోచన థాయిలకు దక్కాయి. ఈ సారి ఈ అవార్డుకు ఏఆర్ రెహమాన్‌ను ఎంపిక చేసారు. అక్టోబర్ 26న ముంబైలోని దీనానాథ్ మంగేష్కర్ హాలులో ఈ బహుమతి ప్రధానం జరుగుతుంది.

లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, ఉషా, మీనాలకు గారాల సోదరుడైన హృదయనాథ్ ఎక్కువగా మరాఠీ చిత్రాలకు సంగీతం అందించారు. అతడి తొలి సినిమా మరాఠీలో వచ్చిన ‘ఆకాష్ గంగ'. మరాఠీ చిత్ర సీమలో హృదయ నాథ్ ను ముద్దుగా బాలా సాహెబ్ అని పిలిచే వారు.

English summary
Oscar-winning composer A R Rahman will be honoured with the Hridaynath Mangeshkar Award in Mumbai on October 26.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu