twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కడప దర్గాలో ఎ ఆర్‌ రెహ్మాన్‌ ఖవ్వాలీ..వివరాలు

    By Srikanya
    |

    కడప : కడపలోని సుప్రసిద్ధ అమీన్‌ పీర్‌ దర్గాలో మూడు రోజుల ఉర్స్‌ మహోత్సవాలకు రంగం సిద్ధమైంది. గంధ మహోత్సవంతో శనివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా రెండవ రోజైన జనవరి 13వ తేదీన ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత ఎ ఆర్‌ రెహ్మాన్‌ ప్రత్యేక ఖవ్వాలీ కచేరీ చేస్తారు.

    దర్గా కార్యదర్శి సయ్యద్‌ అమీర్‌ ఈ మేరకు వివరాలందిస్తూ సంగీత దర్శకుడు ఎ ఆర్‌ రెహ్మాన్‌ తరచూ దర్గాను సందర్శించి ప్రార్థనలు చేస్తుంటారని చెప్పారు. రెహ్మాన్‌ కచేరీని భక్తులంతా వీక్షించేందుకు వీలుగా దర్గా పరిసరాలలో భారీ తెరలు ఏర్పాటు చేస్తామన్నారు. వీలైనంత ఎక్కువమంది ఈ ఖవ్వాలీతో పాటు మూడు రోజులూ జరిగే పలు సంగీత కార్యక్రమాలను తిలకించే ఏర్పాట్లు చేస్తామన్నారు.

    అమీన్‌ పీర్‌ దర్గాలో మూడు రోజుల ఉర్స్‌ మహోత్సవాలలో భాగంగా 13వ తేదీన ఉర్స్‌ ఉత్సవం జరుగుతుంది. చివరి రోజైన 14వ తేదీన తలీల్‌ను నిర్వహిస్తారు. ఈ దర్గా అత్యంత మహిమాన్వితమైనదిగా విశ్వసిస్తూ ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రస్తుతం రహమాన్..రూపొందించిన కడలి ఆడియో తెలుగులోనూ విడుదలైంది. పాటలు యావరేజ్ గా ఉన్నాయని అభిమానలు అంటున్నా..సినిమా విడుదల అయ్యాక పాటలు మరింతగా చొచ్చుకుపోతాయని, ఆదరణ పొందుతాయని భావిస్తున్నారు.

    English summary
    
 Ameen Peer Dargah in Kadapa is being spruced up for Urs on January 13, which will be followed by a Sufi concert and qawwali programme by Oscar-winning musician A.R. Rahman that evening, Dargah Secretary Syed Ameer said on Thursday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X