»   » దాడి చేసింది వాళ్లే: ఏఆర్ రెహమాన్ వివరణ

దాడి చేసింది వాళ్లే: ఏఆర్ రెహమాన్ వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఆస్కార్ అవార్డ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంబంధించిన లాస్ ఏంజిల్స్‌లోని మ్యూజిక్ స్టూడియోపై ఇటీవల దాడి జరిగింది. ఈ ఘటనలో ఆఫీసు ధ్వంసమైంది. ఈ ఘటన సంచలనానికి దారి తీసింది. ఏఆర్ రెహ్మాన్ స్టూడియోపై దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అనేది చర్చనీయాంశం అయింది.

అయితే ఈ ఘటనపై ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని అంటున్నారు రెహమాన్. ఇది దుండగుల పని అనే వార్తలను ఆయన కొట్టి పారేసారు. ఇది స్థానికంగా ఉండే పిల్లల పని అని ఆయన స్పష్టం చేసారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ సంఘటనపై పూర్తి క్లారిటీ ఇచ్చారు రెహమాన్.

A R Rahman’s studio in LA was attacked

ఓ అభిమాని ఈ ఘటనపై స్పందిస్తూ... 'లాస్ ఏంజల్స్ లోని మీ స్టూడియో విధ్వంసానికి గురైందని విన్నాను. ప్రాపర్టీ డామేజ్ తప్ప మీకు ఏమీ కాలేదని ఆశిస్తున్నాను' అని ట్విట్టర్ లో అడిగితే దానికి రెహమాన్ 'థాంక్స్.. నాకు తెలిసి ఇది అక్కడి చిల్డ్రన్స్ పని. కానీ మేము ఈ విషయంపై ఆలోచించి బెటర్ సెక్యూరిటీ ఉండేలా ప్లాన్ చేస్తున్నాం' అని రెహమాన్ వివరణ ఇచ్చారు.

ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ రజనీకాంత్ నటించిన 'కొచ్చాడయాన్' చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. దీంతో పాటు రజనీకాంత్ మరో సినిమా 'లింగా', శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఐ' చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

English summary
A fan asked Rahman, “I heard that your studio in LA was vandalized yesterday, I hope everyone is okay, and the damage is just to property. Please be safe. ” To which ARR replied that, “Oh thank you. I think it is some kids who were trying to be smart. But it is worrying. We have just been getting the security services to look after it. Thank you for your concern.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu