twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏఆర్ రెహ్మాన్ షేర్ చేసిన వీడియో వైరల్.. అందులో ఏముందో తెలుసా?

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ యూఎస్‌లో మానవ హక్కుల న్యాయవాది, సిక్కు కార్యకర్త వాలారీ కౌర్ చేసిన ప్రసంగం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నది.

    By Rajababu
    |

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ యూఎస్‌లో మానవ హక్కుల న్యాయవాది, సిక్కు కార్యకర్త వాలారీ కౌర్ చేసిన ప్రసంగం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఆ వీడియోను సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మన్ షేర్ చేయడం అది మరింత వైరల్‌గా మారింది. డిసెంబర్ 31వ తేదిన ఇమ్రిగేషన్‌పై ట్రంప్ నిషేధం విధించిన నేపథ్యంలో కౌర్ ఈ ప్రసంగాన్ని చేశారు.

     14 లక్షల హిట్స్.. 16వేలసార్లు షేర్

    14 లక్షల హిట్స్.. 16వేలసార్లు షేర్


    కౌర్ ప్రసంగత తర్వాత జనవరి 5వ తేదిన ఈ వీడియోను సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సహా పలువురు ప్రముఖులు తమ ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అప్పటి నుంచి ఈ వీడియోకు 14 లక్షల హిట్స్ సాధించింది. 16 వేల సార్లు నెటిజన్లు షేర్ చేశారు. ఈ వీడియో అమెరికాలో పలువురికి స్ఫూర్తిని నింపుతున్నది.

     ప్రసంగంలో.. అవమానించారు.. వేధించారు..

    ప్రసంగంలో.. అవమానించారు.. వేధించారు..


    103 ఏండ్ల క్రితం తన తాత అమెరికాకు వలస వచ్చారు. భారత్ నుంచి ఫసిఫిక్ సముద్రం మీదుగా ఓడలో ప్రయాణించి అమెరికా చేరుకొన్నారు. నల్ల రంగు చర్మంతో తలపై పాగాతో కనిపించిన తన తాతను చూసి ఇమ్మిగ్రేషన్ అధికారులు కించపరిచారు. ఆయనను అనుమానాస్పద విదేశీయుడిగానే చూశారు. ఎలాంటి విచారణ జరుపకుండా మా తాతను తీసుకెళ్లి జైలులో బంధించారు. ఆ సమయంలో చీకటితో కూడిన ఓ చిన్న గదిలో జీవించారు. చాలా కాలం జైలులో మగ్గిన తర్వాత ఓ శ్వేతజాతీయుడు సహాయం చేయడంతో బెయిల్ పై బయటకు వచ్చారు అని ఆవేదన వ్యక్తం చేశారు.‘ఈ చీకట్లు సమాధిలోని చీకట్లు కాకుండా తల్లి కడుపులోని చీకట్లయితే? అమెరికా అస్తమించడానికి కాకుండా కొత్తగా పుట్టడానికి సిద్ధంగా ఉంటే? అమెరికా కథ సుదీర్ఘ ప్రసవవేదన అయితే?' ఆ దేశం తప్పకుండా గొప్ప దేశంగా మారుతుంది అని కౌర్ చేసిన ప్రసంగానికి చపట్లతో సభ మోర్మోగింది.

     ఏఆర్ రెహ్మాన్ కామెంట్

    ఏఆర్ రెహ్మాన్ కామెంట్


    ఈ ప్రసంగంపై రెహ్మన్ స్పందిస్తూ ఇన్ని అవమానాలను మోసిన ఆమె దేశాన్ని అభివృద్ధి పథంలో ప్రయాణించడానికి కృషి చేస్తున్నది. ఈ చీకటి గదిని అంధకార గుహాగా భావించకుండా మరో జననం కోసం ఓ గర్భంగా భావించారు. అలా కొత్త జననం సాగించకపోతే అమెరికా ఓ శ్రామిక రాజ్యంగానే మిగిలిపోయి ఉండేదేమో అని రెహ్మన్ పేర్కొన్నారు.

     థ్యాంక్యూ ఏఆర్ రెహ్మాన్ జీ..

    థ్యాంక్యూ ఏఆర్ రెహ్మాన్ జీ..


    రెహ్మన్ సందించడంపై కౌర్ హర్షం వ్యక్తం చేస్తూ .. రెహ్మాన్ జీ.. మీరు బాగా చెప్పారు. అమెరికాలో శ్వేతజాతీయుడైన అబ్బాయి తనను నిందించి ఇండియాకు వెళ్లిపో అని అవమానించాడు. అనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. చీకటి గదిని మరో జన్మ కోసం గర్భం పేర్కొనడం అద్భుతం. థ్యాంక్యూ సర్ అని కామెంట్ చేసింది. ప్రతీ ఒక్కరు తమ హక్కులు, ప్రేమను పొందడం కోసం ధైర్యాన్ని కూడగట్టుకోవాలి అని కౌర్ సూచించింది.

    English summary
    civil rights lawyer and Sikh activist Valarie Kaur is making waves in internet. Oscar-winning composer A R Rahman is among those who have recently shared it on Facebook. Since January 5, the speech has collected over 1.4 million views and more than 16,000 shares on Facebook.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X