For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రవితేజ కులం పై తన కామెంట్స్ పై దర్శకుడు వివరణ

  By Srikanya
  |

  హైదరాబాద్ : "ఇటీవల నా ఫేస్‌బుక్‌ ఖాతాలో రవితేజపై వచ్చిన వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు. ఆ ఖాతాని తొలగించింది నేనే అయినా.. అందులో వ్యాఖ్యలు ఎవరు రాశారో నాకు తెలియదు. రవితేజ, నేను మంచి స్నేహితులం. ఆయనతో తప్పకుండా సినిమా చేస్తా" అన్నారు పిల్లా నువ్వు లేని జీవితం దర్శకుడు ఏ.ఎస్ రవికుమార్ చౌదరి. ఆయన తన సొంత అకౌంట్ నుండి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ లు దుమారం లేపాయి.

  ఈ పోస్ట్ లను తరువాత రవికుమార్ డిలీట్ చేసి తన అకౌంట్ ఎవరో హ్యాక్ చేసినట్టు తెలిపారు. రవితేజని, కులాన్ని ఉద్దేశించి చేసిన ట్వీట్ లు అనతికాలంలోనే షేర్ లు అయ్యి..సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ఇవి సంచలనం రేపాయి. ఓ తెలుగు దర్శకుడు ఇలా కులం గురించి మాట్లాడటం ఏమిటని అంతా విమర్శలు చేసారు. ఈ నేపధ్యంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు.

  A.S.Ravikumar Chowdary clarifies on comments against Ravi Teja

  రీసెంట్ గా హిట్టైన పిల్లా నువ్వు లేని జీవితం గురించి మాట్లాడుతూ...

  ''70 ఎమ్‌.ఎమ్‌.తెరపై ఓ మంచి సినిమాని చూడాలి, అది నా నుంచే రావాలి అనే లక్ష్యంతో ఈ కథ రాసుకొన్నా. సినిమా సెట్స్‌పైకి వెళ్లక ముందే ఈ కథను నేను 200 సార్లు చెప్పుంటాను. మా నిర్మాతలకే 150 సార్లు చెప్పాను. కథనంపై ఆధారపడ్డ చిత్రమిది అన్నారు.

  కథ పుట్టిన విధానం చెప్తూ... ఒకసారి యాదగిరి గుట్టకి వెళుతున్నప్పుడు మధ్యలో ఆగాం. అక్కడ రెండు కుందేలు పిల్లలు ఆడుకొంటున్నాయి. ముద్దుగా కనిపించిన ఆ కుందేళ్లను చూసినప్పుడే ఈ కథ పుట్టింది. అందులోని ఆడ కుందేలుపై సింహం కన్నుపడితే ఎలా ఉంటుంది? ఆడ కుందేలుని కాపాడుకొనేందుకు మగ కుందేలు సింహంతో పోరాడితే ఎలా ఉంటుంది? అనే ఆలోచనల నేపథ్యంలో ఈ కథ సిద్ధమైంది. సాయిధరమ్‌ తేజ్‌ని చూడగానే నా కథకి తనైతేనే బాగుంటుందనుకొన్నా'' అని వివరించారు.

  తన అంచనాలకు తగ్గట్టుగా నటించారని చెప్తూ... ''జగపతిబాబు పోషించిన పాత్రని శ్రీహరిని దృష్టిలో ఉంచుకొని రాసుకొన్నాను. ఆయన తప్ప హీరో,హీరోయిన్ ఎవ్వరూ నా మనసులో లేరు. అయితే సాయిధరమ్‌ తేజ్‌ హీరో అనుకొన్నాక... ఆయన చిరంజీవి మేనల్లుడు కాబట్టి ఆ అంచనాల మేరకు మాస్‌ అంశాలకు ప్రాధాన్యమిస్తూ కథకు మెరుగులు దిద్దుకొన్నాను.

  ఇంతలోనే శ్రీహరిగారు చనిపోవడంతో నేను డీలాపడిపోయాను. ఒక్క మాటలో చెప్పాలంటే... శ్రీహరి చనిపోయారు, నేను చనిపోలేదంతే. ఆ సమయంలో అల్లు అరవింద్‌, దిల్‌రాజు నాకు ధైర్యం చెప్పి ముందుకు నడిపించారు. శ్రీహరి లేని లోటుని తీర్చేలా జగపతిబాబు నటించారు. మాటలు సమకూర్చిన డైమండ్‌ రత్నం, ఛాయాగ్రాహకుడు శివేంద్ర పనితీరు సినిమాకు మరింత బలాన్నిచ్చింది'' అన్నారు.

  కెరీర్ లో సమస్యలు గురించి చెప్తూ ...'''యజ్ఞం తర్వాత పరాజయాలు ఎదురవడానికి కారణం నేనే. కొన్ని తప్పులు చేశాను. వ్యక్తిగత కారణాలతో సినిమాలపై పూర్తిస్థాయిలో మనసు పెట్టలేకపోయాను. 'ఆటాడిస్తా' మంచి సినిమానే. కానీ ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. అందుకే కొన్నాళ్లు దర్శకత్వానికి దూరమైనా ఒక మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకొని కష్టపడ్డా. ఆ కష్టానికి తగిన ఫలితం దక్కింది. తదుపరి చిత్రం ఎవరితో అన్నది త్వరలోనే చెబుతా అన్నారు.

  English summary
  Ravikumar Chowdary said that he didn't post offensive posts targeted against actor Ravi Teja were appeared on the official social networking account. A nd someone has hacked his account. He also said that some people has password of his account with them and so to avoid any problems in the future, he has deleted the account.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X