Just In
- 1 hr ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 1 hr ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 2 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 2 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ సంఘటన రేణు దేశాయ్‌ని ఇంకా వెంటాడుతోంది!
హైదరాబాద్: ఏమైనా షాకింగ్ సంఘటనలు చూసినపుడు...ఆ సంఘటనలకు సంబంధించిన జ్ఞాపకాలు జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఉంటాయి. నటి, దర్శకురాలు రేణు దేశాయ్ జీవితంలో కూడా ఇలాంటి ఓ భయంకరమైన సంఘటన ఉంది. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు ఆమెను వెంటాడుతున్నాయి.
2001, సెప్టెంబర్ 11 న ఆమె తను పవన్ కళ్యాణ్ తో కలిసి న్యూయార్కులో ఉన్నారు. ఆ రోజు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను ఉగ్రవాదులు కూల్చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో వేలాది మంది మరణించారు. ప్రపంచాన్ని వణికించిన సంఘటన. దీని గురించి ఆమె మాట్లాడుతూ..‘చివరి సారిగా నేను 2001లో న్యూయార్కు వెళ్లాను. సెప్టెంబర్ 11న జరిగిన సంఘటన నన్ను ఇప్పటికీ వెంటాడుతోంది.14 ఏళ్లు గడిచినా ఆ భయానక జ్ఞాచకాలు నన్ను వీడటం లేదని అన్నారు.
ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రస్తుతం రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె దర్శకత్వం, సినీనిర్మాణ రంగాల్లో తన సత్తా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేణు దేశాయ్ దర్శకత్వం వహించిన ‘ఇష్క వాలా లవ్' ఇంకా విడుదలకు నోచు కోవడం లేదు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ మరాఠీలో ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తన కూతురు పేరు మీద 'శ్రీ ఆద్య ఫిలింస్', కొడుకు పేరు మీద ‘అకీరా ఫిల్మ్స్' అనే సినీ నిర్మాణ సంస్థలను స్థాపించింది. ఇప్పటికే 'మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే చిత్రాన్ని నిర్మించి విజయం సొంతం చేసుకున్న రేణు దేశాయ్ తాజాగా ఆమె స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'ఇష్క్ వాలా లవ్' అనే మరాఠీ చిత్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.
ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'ఖుషి' చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు సాంగులను కంపోజ్ చేసాడు. గతేడాది అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ మధ్య ప్రకటించినా....ఇప్పటికీ విడుదల కాలేదు.