»   » కాటమరాయుడు కోసం గ్రామాన్నే సృష్టించారు.. 18న ప్రీ రిలీజ్..

కాటమరాయుడు కోసం గ్రామాన్నే సృష్టించారు.. 18న ప్రీ రిలీజ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాటమరాయుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ చిత్రంపై క్రేజ్ పెరిగిపోతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన పలు విషయాలు అభిమానుల్లో జోష్ పెంచుతున్నాయి. కాటమరాయుడు చిత్రం కోసం ప్రత్యేకంగా ఊరునే నిర్మించారు. పవన్ కల్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి షూటింగ్ పరిస్థితి లేకపోవడం వల్లే ఊరు సెట్‌ను వేయాల్సి వచ్చిందని కళ దర్శకుడు బ్రహ్మ కడలి తెలిపారు.

గ్రామీణ వాతావరణం..

గ్రామీణ వాతావరణం..

రాజకీయాల్లోనూ, ఇతర కార్యక్రమాల్లోనూ పవన్ కల్యాణ్ చాలా బిజీగా ఉన్నారు. మంచి గ్రామీణ వాతావరణం ఉన్న ఊరికి వెళ్లడం కష్టమైంది. ఆ పరిస్థితుల్లో ఓ గ్రామాన్ని నిర్మించాం అని బ్రహ్మ కడలి వెల్లడించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా అలాంటి గ్రామం కనిపించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు.


నాలుగు ప్రధాన సెట్లు

నాలుగు ప్రధాన సెట్లు

ఊరు సెట్‌లో నాలుగు ప్రధాన భాగాలు ఉంటాయి. ఒకటి పవన్ కల్యాణ్ ఇల్లు. రెండోది శ్రతిహాసన్ నివాసం. ఓ ట్రైన్ కంపార్ట్‌మెంట్. ఓ పురాతన ఆలయం సెట్‌ను నిర్మించాం అని ఆయన చెప్పారు. వీటన్నింటిని కేవలం ఐదు రోజుల్లోనే నిర్మించామని బ్రహ్మ తెలిపారు.


శివాలయం సెట్ కీలకం..

శివాలయం సెట్ కీలకం..

రాళ్లు, రప్పలతో శిథిలావస్థలో ఉన్న శివాలయం సెట్ కథ డిమాండ్ చేసింది. చిత్రంలో ఆలయంలో సన్నివేశాలు అత్యంత ప్రధానం. హైదరాబాద్‌ చుట్టుపక్కల అలాంటి ఆలయం కనిపించలేదు. అందుకే వాటిని తక్కువ సమయంలో సృష్టించాం. ఇందుకోసం 400 మంది ఆర్టిస్టులు అవిశ్రాంతంగా పనిచేశారు. సకాలంలో పూర్తిచేయడంలో వారు నిబద్ధత పనిచేశారు.


పవన్‌తో బ్రహ్మ కడలి

పవన్‌తో బ్రహ్మ కడలి

పవన్ కల్యాణ్‌తో కళా దర్శకుడు బ్రహ్మ కడలి పనిచేయడం ఇది తొలిసారి కాదు. గతంలో పవర్ స్టార్‌తో కలిసి గబ్బర్ సింగ్, గోపాలా గోపాలా, సర్దార్ గబ్బర్ సింగ్ పనిచేశారు.


రాయలసీమ ఫ్యాక్షన్‌ కథతో..

రాయలసీమ ఫ్యాక్షన్‌ కథతో..

కాటమరాయుడు చిత్రంలో కరుకుగా కనిపించే పవన్ కల్యాణ్ గెటప్‌ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నది. రాయలసీమ నేపథ్యం ఉన్న ఫ్యాక్షన్ కథా నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్రంలోని ప్రతీ సన్నివేశం అభిమానులకు కన్నుల పండువగా ఉంటుంది.


18న ప్రీ రిలీజ్ ఫంక్షన్

18న ప్రీ రిలీజ్ ఫంక్షన్

తమిళంలో విజయవంతమైన వీరం చిత్రానికి రీమేక్‌గా కాటమరాయుడు రూపొందుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ మార్చి 18న నిర్వహించనున్నారు. గతనెల విడుదలైన టీజర్‌ను దాదాపు కోటి మందికి పైగా వీక్షించారు.


నటీనటులు వీరే..

నటీనటులు వీరే..

అనుప్ రూబెన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శివ బాలాజీ, కమల్ కామరాజు, అజయ్, అలీ, రావు రమేశ్, వేణు మాధవ్, నాజర్, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


English summary
Brahma Kadali said “Since Pawan Kalyan has very tight schedules, it wasn’t even an option for us to go to a real village to film. Filmmakers will be celebrating the pre-release function of March 18, 2017
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu