‘ఎ ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం’ చిత్రాన్ని నిలిపేసిన ప్రభుత్వం
చలం 1937లో రాసిన 'బ్రాహ్మణీకం' నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్టు దర్శక నిర్మాత చెబుతున్నారు. చలం వంటి గొప్ప వ్యక్తి రాసిన పుస్తకం పేరును అడ్డుపెట్టుకుని, బ్రాహ్మణ స్త్రీలను కించపరిచేలా సినిమాలు తీయడం పట్ల బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి మేనేజింగ్ డైరెక్టర్ చంద్రవదన శుక్రవారం రాష్ట్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. సినిమాటోగ్రఫీ చట్టం కింద ఈ చిత్ర ప్రదర్శన ను నిలిపివేయాలని కోరారు. ఈ చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల కాకుండా రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ తదితరులు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి డీకే అరుణకు శుక్రవారం వినతిపత్రాన్ని సమర్పించారు.
అధికారులు కూడా సినిమాపై అభ్యంతరం చెప్పడంతో మంత్రి అరుణ సినిమా విడుదల నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసారు. బ్రాహ్మనిజం చిత్రానికి దర్శకత్వం, నిర్మాత, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, లిరిక్స్ ఇలా అన్ని విభాగాలు జీటీ పూరి అనే ఒకే వ్యక్తి హ్యాండిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












