»   » ‘శమంతకమణి’ కోసం రోజుకు 40 వేలు చెల్లించాం: ఆది

‘శమంతకమణి’ కోసం రోజుకు 40 వేలు చెల్లించాం: ఆది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నారా రోహిత్‌, సుధీర్ బాబు, సందీప్ కిష‌న్‌, ఆది హీరోలుగా భ‌వ్య క్రియేష‌న్స్ తెర‌కెక్కిస్తున్న చిత్రం శ‌మంత‌క‌మ‌ణి. చాందిని చౌద‌రి, జెన్ని, హ‌నీ నాయిక‌లు. వి. ఆనంద‌ప్ర‌సాద్ నిర్మాత‌. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈచిత్రం జులై 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్లలో బిజీ అయిపోయింది. తాజాగా ఆది మీడియాతో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. శమంతకమణి కథ, తన క్యారెక్టర్ బాగా నచ్చడం వల్లనే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నానని ఆది తెలిపారు.

అసలు హీరో దర్శకుడే

అసలు హీరో దర్శకుడే

ఈ సినిమాలో నలుగురు హీరోలు ఉన్నా అసలైన హీరో ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య. రోహిత్, సందీప్, సుధీర్ లతో కలిసి ప‌నిచేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. న‌లుగురం ఎక్క‌డా ఇగోల‌కు పోలేదు. `ల‌వ్ లీ` త‌ర్వాత రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారితో ప‌నిచేయ‌డం సంతోషంగా ఉందన్నారు.

తన పాత్ర గురించి

తన పాత్ర గురించి

ఈ సినిమాలో ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగం కోసం వెతికే కుర్రాడిగా చేస్తున్నాను. భరణిగారు, హేమగారు నాకు అమ్మానాన్నలుగా, చాందిని తన పాత్రకు లవ్ ఇంట్రెస్టుగా నటించిందని, సినిమాకు మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం, స‌మీర్‌ సినిమాటోగ్రాఫీ బాగా ప్లస్సవుతుంది అన్నారు. ఇప్పటి ట్రెండుకు తదిన విధంగా దర్శకుడు కథ తయారు చేశాడని ఆది తెలిపారు.

37 రోజుల్లోనే షూటింగ్ పూర్తి

37 రోజుల్లోనే షూటింగ్ పూర్తి

దర్శకుడు మాకు నారేట్ చేప్పుడు ఏదైతే చెప్పాడో.... స్క్రీన్ మీద కూడా అదే చూపించాడు. కథ దగ్గర నుండి సినిమాలో వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలా ఉండాలి, రీ రికార్డింగ్ ఎలా కావాలి, ట్రైలర్ ఎలా ఉండాలి, టీజర్ ఎలా ఉండాలి ఇలా అన్నింటికి ముందే నోట్స్ రాసుకుని అంతా సిద్ధమయ్యాక శ్రీరామ్ ఆదిత్య సినిమా మొదలు పెట్టాడని, అందుకే కేవలం 37 రోజుల్లోనే సినిమా పూర్తయిందని ఆది తెలిపారు.

రోజులు 40వేలు అద్దె

రోజులు 40వేలు అద్దె

సినిమాలో శమంతకమణి అనేది ఒక కారు. ఇందుకోసం 1970 మోడల్ రోల్స్ రాయిస్ కారును ఉపయోగించాం. రోజుకు 40 వేలు చెల్లించి ఆ కారును అద్దెకు తెచ్చి షూటింగ్ చేసినట్లు హీరో ఆది వెల్లడించారు.

భవ్య క్రియేషన్స్ గురించి

భవ్య క్రియేషన్స్ గురించి

భవ్య క్రియేషన్స్ వారు సినిమా బాగా తీశారు. ఆనంద్ ప్రసాద్ గారు కథను నమ్మిదిగారు. డిఫరెంట్ ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. రేపు రిలీజ్ కూడా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 600 థియేటర్లలో సినిమా విడుదల చేస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు పబ్లిసిటీ ఉంటే తప్ప జనాలు సినిమా చూడటానికి రావడం లేదు. ఈ విషయంలో వారు బాగా కేర్ తీసుకున్నారు. ట్రైలర్ చూస్తే ఎంత ఖర్చు పెట్టారో అర్థమవుతుంది అని ఆది తెలిపారు.

నెక్ట్స్ మూవీ గురించి

నెక్ట్స్ మూవీ గురించి

తన తర్వాతి సినిమా గురించి మాట్లాడుతూ.... వి4 క్రియేషన్స్ బేనర్లో ఓ సినిమా చేస్తున్నాను. స్టూడియో గ్రీన్, బన్నీ వాసు, అల్లు అరవింద్, యూవి క్రియేషన్స్ వారు కలిపి ఈ బేనర్ స్థాపించారు. ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉందని ఆది తెలిపారు.

English summary
Aadi interview about Shamanthakamani. Shamanthakamani starring Nara Rohith, Sundeep Kishan, Aadi and Sudheer Babu. The makers are using unique strategy to promote the movie as they are releasing the character look poster of each cast day by day to generate much hype. Nara Rohith will be seen playing Inspector Ranjith Kumar, Aadi as Karthik, Sudheer Babu as Krishna and Sundeep Kishan as Kotipalli Siva.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu