»   » పవన్‌తో పోటీ పడితేఫ్యూచర్ బావుంటుందట

పవన్‌తో పోటీ పడితేఫ్యూచర్ బావుంటుందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆది పినిశెట్టికి తెలుగులో హీరోగా కంటే విల‌న్‌గానే ఎక్కువ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. గుండెల్లో గోదారి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది, త‌ర్వాత మ‌లుపుతో తెలుగులో మంచి స‌క్సెస్ సొంతం చేసుకున్నాడు. అల్లుఅర్జున్ స‌రైనోడుతో విల‌న్‌గా మారి రూట్ మార్చాడు. ఇప్పుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రంలో కూడా విలంగా నటిస్తున్న సంగతి తెలిసిందే..

ప్రస్తుతం

ప్రస్తుతం

హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ఓ ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. పవన్‌ తో స్టైలిష్‌గా సాగే ఓ పోరాట ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరగనుంది. ప్రస్తుతం సినిమా పేరు గురించి అభిమానులు ఆసక్తికరంగా మాట్లాడుకొంటున్నారు.

ఇప్పటికే

ఇప్పటికే

కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. దాంతో చిత్రబృందం త్వరలోనే పేరును ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. పవన్‌, త్రివిక్రమ్‌ల సినిమాలో విలన్‌గా నటించడాన్ని ఆది పినిశెట్టి బాగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. విలన్ గానే అయినా పవన్ కి పోటీగా నిలబడటం అంటే మాటలు కాదు

సరైనోడులో విలన్‌గా

సరైనోడులో విలన్‌గా

త్రివిక్రమ్‌ సినిమాల్లో విలన్స్‌ ప్రత్యేకంగా వుంటారు కనుక, ఈ చిత్రం తనని పెద్ద రేంజ్‌కి తీసుకెళుతుందని ఆది భావిస్తున్నాడు. సరైనోడు సినిమాలో విలన్‌గా నటించి మార్కులు కొట్టేసిన ఆది ఆ సినిమాతోనే త్రివిక్రమ్‌ దృష్టిలో పడ్డాడట. అతడిని దృష్టిలో పెట్టుకునే విలన్‌ క్యారెక్టర్‌ని రాసాడట.

సరైన డెసిషన్‌

సరైన డెసిషన్‌

విలన్‌ క్యారెక్టర్‌ చాలా కొత్తగా వుంటుందని, ఆదికి ఈ చిత్రంతో పెద్ద బ్రేక్‌ వస్తుందని అంటున్నారు. పవన్‌కళ్యాణ్‌ సినిమా అనేసరికి రీచ్‌ పరంగా హద్దులేం వుండవు. పైగా ఇందులోని తన క్యారెక్టర్‌ని త్రివిక్రమ్‌ చాలా బాగా తీర్చిదిద్దాడట. నటుడిగా నిలదొక్కుకోవడానికి ఏళ్ల తరబడి కష్టపడిన ఆది పినిశెట్టి 'సరైనోడు' సినిమాలో విలన్‌గా నటించడానికి సరైన టైమ్‌లో డెసిషన్‌ తీసుకున్నాడు.

గోపిచంద్‌ తర్వాత

గోపిచంద్‌ తర్వాత

అంతవరకు మిడిల్‌ ఏజ్‌ లేదా ఏజ్‌ బార్‌ విలన్లని చూసిన తెలుగు వాళ్లకి ఇతను ఫ్రెష్‌గా కనిపించాడు. గోపిచంద్‌ తర్వాత అంత ఇంపాక్ట్‌ వున్న విలన్‌గా పేరు తెచ్చుకున్నాడు. దాంతో ఆది పినిశెట్టికి వరుసగా పెద్ద సినిమాల్లో అవకాశాలొచ్చాయి. పవన్‌తో, చరణ్‌తో పాటు అతనిప్పుడు పలువురు అగ్ర హీరోలతో కలిసి పని చేస్తున్నాడు.

English summary
We know that Aadi Pinisetty has been finalized as the main villain for Pawan. Aadi has stole the show with his superb performance as a stylish villain in Allu Arjun starrer 'Sarrainodu'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu