»   »  అదృష్టం ఆది పినిశెట్టిని వరించింది

అదృష్టం ఆది పినిశెట్టిని వరించింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి నటుడుగా మంచి మార్కులు వేయించుకున్నా ఆఫర్స్ మాత్రం పెద్దగా రావటం లేదు. తమిళంలో మొదట ట్రై చేసి , తెలుగులోకి గుండెల్లో గోదారి వంటి చిత్రాలతో వచ్చాడు. అయినా ఇక్కడా అతన్ని గుర్తించి సినిమా ఇచ్చిన వారు లేరు. కెరీర్ లో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ సమయంలో అతనికి హిట్ వచ్చే దారి కనపడుతోంది. తెలుగులో మంచి విజయం సాధించిన వెంకటాద్రి ఎక్సప్రెస్ సినిమా తమిళ రీమేక్ కి అతనికి హీరోగా ఛాన్స్ వచ్చింది. తక్కువ బడ్డెట్ లో నిర్మాణమయిన ఈ చిత్రం ఆ మధ్య కన్నడంలో తిరుపతి ఎక్సప్రెస్ పేరుతో విడుదలై అక్కడా హిట్ కొట్టింది. దాంతో తమిళ వెర్షన్ పైన కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

చిత్రం కథేమిటంటే... సందీప్‌ (సందీప్‌ కిషన్‌) సగటు తెలుగు సినీ హీరోలా తన కళ్లెదురుగాఅన్యాయం జరుగుతూంటే సహించలేడు. అయినదానికీ,కానిదానికి ప్రతీ విషయంలో తలదూర్చే అతనంటే తండ్రి రామ్మూర్తి(నాగినీడు)కి నచ్చదు. ఆయన శిశుపాలుడిలా వంద తప్పుల వరకే పరిమితి ఇచ్చారు. ఆల్రెడీ సందీప్ తొంభై తొమ్మిది తప్పులు చేసేశాడు. మిగిలిన ఒక్క తప్పు చేయకుండా ఎలా తప్పించుకోవాలి అనుకున్న సమయంలో అతను తన సోదరుడు (బ్రహ్మాజీ) పెళ్లికి తిరుపతి కి సకుటుంబ సమేతంగా బయిలు దేరతాడు.

 Aadi Pinisetty in Venkatadri Express remake

ఆ ప్రయాణంలో అతనికి వందవ తప్పు చేయాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది. ఈ ప్రయాణంలోనే ప్రార్థన (రకుల్‌ ప్రీత్‌సింగ్‌) పరిచయమవుతుంది. ఆమె చాలా ప్రాక్టికల్ ...లెక్కల మనిషి. ఇద్దరి గమ్యం ఒక్కటే. తిరుపతి వెళ్లాలి. కానీ కారణాలు వేరు. ఈ రైలు ప్రయాణం అతని జీవితాల్ని ఎలా మలుపు తిప్పింది? 100 వ తప్పు చేయకుండా తప్పించుకున్నాడా..ఏం తిప్పలు పడ్డాడు అనేదే ఈ చిత్ర కథ.

దర్శకుడు మేరుపాక గాంధీ ఈ చిత్ర కథను ఆసక్తికంగా తయారు చేసుకోవడంతో పాటు కామెడీ అంశాలు మేళవించి వినోదాత్మంగా తెరకెక్కించారు. స్క్రీన్ ప్లే, డైలాగులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఏవో కామెడీ సీన్లు కావాలని అతికించినట్లు కాకుండా.....సినిమా కథలో కలిసి పోయే విధంగా తెరకెక్కించిన హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కథ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగిస్తూ...ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. నేరేషన్లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ సినిమాపై పెద్దగా ఎఫెక్టు చూపలేక పోయాయి.

English summary
Aadi Pinisetty is playing the male lead of “Venkatadri Express” in place of Sundeep Kishan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu