»   » హీరో మనోజ్ నేను అడుక్కున్నాం.. డబ్బుల్లేక బిచ్చగాళ్లుగా మారాం.. నాని కళ్లలో నీళ్లు.. ఆది

హీరో మనోజ్ నేను అడుక్కున్నాం.. డబ్బుల్లేక బిచ్చగాళ్లుగా మారాం.. నాని కళ్లలో నీళ్లు.. ఆది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి విలక్షణమైన పాత్రలతో దక్షిణాది సినీ పరిశ్రమలో రాణిస్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన గుండెల్లో గోదారి, సరైనోడు ఆయన నటనా ప్రతిభను భయపెట్టాయి. సరైనోడు తర్వాత తెలుగు, తమిళ భాషల్లో బిజీగా మారాడు. సినీ పరిశ్రమలో ఆయనకు మనోజ్ తదితరులు మంచి మిత్రులు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు మనోజ్‌కు, ఆదికి ఎదుర్కొన్న ఓ సరదా సంఘటనను పంచుకొన్నారు.

పారిస్‌లో నాకు, మనోజ్‌కు చేదు అనుభవం

పారిస్‌లో నాకు, మనోజ్‌కు చేదు అనుభవం

‘మంచు మనోజ్‌ నాకు చాలా మంచి ఫ్రెండ్. మా నాన్న రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో మోహన్‌బాబు చాలా సినిమాలు చేశారు. ఆ సమయంలో ఓ సినిమా షూటింగ్‌ కోసం మోహన్‌బాబు కుటుంబంతో కలిసి, మా ఫ్యామిలీ కూడా ఫ్రాన్స్‌కు వెళ్లాం. పారిస్‌లో ఓ చోట షూటింగ్‌ జరుగుతున్నది. ఆ సమయంలో ఎవరికీ చెప్పకుండా మనోజ్‌ నేను కలిసి ఓ బస్‌ ఎక్కి వేరే చోటుకి వెళ్లాం అని ఆది తెలిపాడు.

జేబులో చిల్లిగవ్వ కూడా లేదు..

జేబులో చిల్లిగవ్వ కూడా లేదు..

అయితే కొన్ని ప్రదేశాలు తిరిగి షూటింగ్‌ ప్రాంతానికి చేరుకొన్నాం. అయితే అక్కడికి వచ్చేసరికి షూటింగ్ యూనిట్ సభ్యులు ఎవరూ లేరు. దాంతో మాకు చాలా భయమేసింది. జేబులో చిల్లిగవ్వ కూడా లేదు. ఎలా వెళ్లాలో తెలియదు. అప్పడే ఓ ఆలోచన ఫ్లాష్‌లా మెరిసింది. అదేమిటంటే..

పాటలు పాడి డబ్బులు అడుక్కొన్నాం..

పాటలు పాడి డబ్బులు అడుక్కొన్నాం..

ఫ్రాన్స్‌లో లాగ్వేంజ్ సమస్య. ఇంగ్లీష్ ఎవరూ మాట్లాడరు. అంతా ఫ్రెంచ్ భాషలోనే మాట్లాడుతారు. దీంతో మాకు ఏం చేయాలో తెలియలేదు. చివరకు ఓ బ్రిడ్డి వద్ద టోపీలు ముందు పెట్టుకుని తెలుగు పాటలు పాడాం. డబ్బుల కోసం బిచ్చగాళ్లుగా మారిపోయాం. మా పాటలు విని కొంతమంది డబ్బులు వేశారు. ఆ డబ్బులతో బస్‌ ఎక్కి మా వాళ్లను చేరుకున్నాం అని ఆది వెల్లడించారు.

విలన్ పాత్రలపై దృష్టి

విలన్ పాత్రలపై దృష్టి

సరైనోడు చిత్రం ఆదికి మంచి గుర్తింపు తెచ్చింది. గతంలో తమిళ, తెలుగులో హీరోగా నటించిన ఆది ప్రస్తుతం విలన్‌ పాత్రలపై దృష్టిపెట్టాడు. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌, నాని సినిమాల్లో నటిస్తున్నాడు. నానీ నటించిన చిత్రం నిన్ను కోరి త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో ఆది కీలకపాత్రను పోషిస్తున్నాడు.

నాని కళ్లలో నీళ్లు తిరిగాయి.

నాని కళ్లలో నీళ్లు తిరిగాయి.

ఆరు, ఏడు సంవత్సరాలుగా నానితో సినిమా చేయాలనుకుంటున్నాను. అది నిన్నుకోరి చిత్రంతో కుదిరింది. కథ వినగానే నాని కళ్లలో నీళ్లు కనిపించాయి. సహజ నటనతో ఉమామహేశ్వరరావు పాత్రకు నాని ప్రాణం పోశాడు అని ఆది అన్నాడు.

English summary
Actor Manoj Manchu and Aadi Pinishetty are good friends. Aadi said that We went to france for my father and mohanbabu movie shooting. Then we went for another place without intimating my father. We lost their address. We dont have money that time. so we begged on paris streets and collected money.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more