For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సిక్స్ ప్యాక్,సెక్సీ లవ్ ట్రాక్ కలిస్తే...('రఫ్‌' ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్ : 'ప్రేమకావాలి'తో తెరకు పరిచయమైన ఆది 'లవ్‌లీ', 'గాలిపటం' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకొన్నారు. తాజాగా 'రఫ్‌' చిత్రంలో నటించారు. ఈ రోజు (నవంబర్ 28న )ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. వినోదం, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు, ఫైట్లు, డ్యాన్సులు అన్నీ ఇందులో ఉన్నాయి. ఆది సినిమాల్లోకెల్లా అత్యధిక వ్యయంతో తెరకెక్కింది. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించి వదిలేయడం తప్పు అనే భావనతో ఉన్న యువకుడి పాత్రలో ఆది నటించారు. ఆది నటించిన గత సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆది ఆశలన్నీ ఈ సినిమాపై ఉన్నాయి. దర్శకుడు కొత్తవాడు కావడంతో రఫ్‌ ఎలావుంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

  దర్శకుడు మాట్లాడుతూ... ఆదిలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అతని కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుంది. అన్ని వర్గాలను అలరించే అంశాలు ఇందులో వున్నాయి అన్నారు.

  ఆది మాట్లాడుతూయ... ''ఈ సినిమాలో నేను ఆరు పలకల దేహంతో కనిపిస్తాను. ఆ దేహం కోసం తొమ్మిది నెలలు కష్టపడ్డాను. ఆరు పలకల దేహం నేను ముందుగా నిర్ణయించుకొని చేసింది కాదు. సినిమాలో ఐదారు పోరాట ఘట్టాలు ఉంటాయి. వాటిలో వైవిధ్యం చూపించాలనుకొన్నాం. ఎలా అనుకొంటున్న దశలోనే నాకూ, మా దర్శకుడికి వచ్చిన ఆలోచనే ఆరు పలకల దేహం. ఇప్పుడు ఆ పోకడ కూడా నడుస్తోంది కాబట్టి నేను కసరత్తులు మొదలుపెట్టా. ఈ సినిమా ఆలస్యం కావడానికి అదొక కారణం. మనం ఎంత కష్టపడినా అంతిమంగా ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించామా లేదా అన్నదే ముఖ్యం. ఈ సినిమా ప్రేక్షకుడిని ఏ దశలోనూ నిరుత్సాహపరచదు. కథ, కథనం, మలుపులు ఆకట్టుకునేలా ఉంటాయి'' అన్నారు.

  Aadi,Rakul Preet Singh 's Rough preview

  ఇక పోతే రఫ్‌ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది ఈ చిత్రం హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. జోరు మీదున్న ఈ నటి సక్సెస్‌తో దూసుకుపోతుంది. రీసెంట్‌గా ఆమె నటించిన కరెంట్‌తీగ సినిమాలో పెంచిన గ్లామర్‌ డోస్‌కు కుర్రాళ్లు ఆమెకు అభిమానులుగా మారిపోయారు. లిప్‌లాక్‌లకు వెనుకాడని ఈ ముద్దుగుమ్మ ‘రఫ్‌'చిత్రంలో ఆదితోనూ లిప్‌లాక్‌ చేసింది. తొలి ట్రైలర్‌లో ఉన్న లిప్‌లాక్‌ సీన్‌ జనాలను ఆకట్టుకునే విధంగా ఉంది.

  బ్యానర్ :శ్రీదేవి ఎంటర్‌టైన్‌మెంట్స్‌

  నటీనటులు:ఆది, రకుల్‌ప్రీత్ సింగ్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, రవిప్రకాశ్, రాజా రవీంద్ర, నాగినీడు, పవిత్రా లోకేష్, సామ్రాట్ శివారెడ్డి, అదర్స్ రఘు, పృధ్వి, ధన్‌రాజ్, కాట్రాజు తదితరులు

  సంగీతం:మణిశర్మ,

  మాటలు:మరుధూరి రాజా,

  కెమెరా:కె.కె.సెంథిల్‌కుమార్,

  ఫైట్స్:గణేశ్,

  ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్,

  పాటలు: భాస్కరభట్ల,

  నిర్మాత:మాధవరం అభిలాష్,

  కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సిహెచ్.సుబ్బారెడ్డి.

  విడుదల తేదీ: 28 నవంబర్, 2014

  English summary
  Rough starring Aadi, Rakul Preet Singh under Subbareddy's direction is releasing on today (Nov 28th). Rough is touted to be a mass action love story where Rakul Preet Singh is playing the love interest of Aadi. C. H. Subba Reddy is making his debut as director and M. Abhilash produced Rough on Sridevi Entertainments banner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X