»   » ఆది కొత్త చిత్రం ‘చుట్టాలబ్బాయి’ ట్రైలర్ (వీడియో)

ఆది కొత్త చిత్రం ‘చుట్టాలబ్బాయి’ ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఆది హీరోగా వీరభద్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'చుట్టాలబ్బాయి'. శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో శనివారం రాత్రి విడుదలైంది. ఈ సందర్బంగా ట్రైలర్ విడుదలైంది.

ఎస్‌.ఎస్‌. థమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలను శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హాజరై ఆడియో సీడీని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి నటుడు సాయికుమార్‌, దర్శకుడు కొరటాల శివ, రాజ్‌తరుణ్‌, సందీప్‌కిషన్‌, సుధీర్‌బాబు, పృథ్వీ, రఘుబాబు, అన్నపూర్ణ, జీవిత, కోనవెంకట్‌ తదితరులు హాజరయ్యారు.

నిర్మాతలు మాట్లాడుతూ ... ''చుట్టాలబ్బాయి' టీజర్‌కు ట్రమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. టీజర్‌ రిలీజ్‌ అయ్యాక బిజినెస్‌ పరంగా మంచి క్రేజ్‌ వచ్చింది. అన్ని ఏరియాలు చాలా స్పీడ్‌గా బిజినెస్‌ అవుతున్నాయి. 'ప్రేమకావాలి', 'లవ్‌లీ'లాంటి సూపర్‌హిట్స్‌ ఇచ్చిన ఆదికి 'చుట్టాలబ్బాయి' మరో సూపర్‌హిట్‌ అవుతుంది.

Aadi's Chuttalabbayi - Theatrical Trailer

మా దర్శకుడు వీరభద్రమ్‌ ఈ చిత్రాన్ని అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తీశారు. 'అహనాపెళ్లంట', 'పూలరంగడు' తర్వాత వీరభద్రమ్‌ గారికి 'చుట్టాలబ్బాయి' చాలా పెద్ద హిట్‌ సినిమా అవుతుంది. జూలైలోనే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

ఆది, నమిత ప్రమోద్‌, డైలాగ్‌కింగ్‌ సాయికుమార్‌, బ్రహ్మానందం, పోసాని క ష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు: భవాని ప్రసాద్‌, స్టిల్స్‌: గుణకర్‌, నిర్మాతలు: వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్ళూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్‌.

English summary
Chuttalabbayi movie trailer released.. The Telugu movie Chuttalabbayi starring Aadi and Namitha Pramod.Directed by Veerabhadram Chowdary. Produced by Venkat Talari and Ram Talluri on Sree Iswarya Lakshmi Movies and SRT Entertainments banners.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu