»   » పుట్టిన రోజునే ఆడియో పంక్షన్

పుట్టిన రోజునే ఆడియో పంక్షన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాయికుమార్‌ తనయుడు ఆది, అదాశర్మ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం గరం. ఈ చిత్రానికి మదన్‌ దర్శకత్వం వహిస్తుండగా, అగస్త్య సంగీతం అందిస్తున్నారు. ఆర్కే సినిమాస్‌ పతాకంపై రాజ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 23న ఆది బర్త్‌డే. ఈ సందర్భంగా గరం ఆడియో ఆవిష్కరన వేడుక జరగనుంది.

అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకలో పలువ్ఞరు సినీ రంగ ప్రముఖులు పాల్గొననున్నారు. పెళ్లైన కొత్తలో ఫేం అగస్త్య ఈ చిత్రానికి స్వరాలందించారు.


నిర్మాత పి. సురేఖ మాట్లాడుతూ... కథాబలం ఉన్న ఈ చిత్రంలో పాటలకు స్కోప్‌ ఉంది. అగస్త్య అద్భుతమైన ట్యూన్స్‌ ఇచ్చారు. మంచి మ్యూజికల్‌ హిట్‌ మూవీగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. లవ్‌, యాక్షన్‌, సెంటిమెంట్‌, కామెడీ...ఇలా అన్నీ అంశాలూ ఉన్న మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇటీవల ప్రభాస్‌ విడుదల చేసిన ఈ చిత్రం మొదటి టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది.


Aadi's ‪ ‎Garam‬ audio on on 23rd.

పాటలు కూడా ప్రేక్షకాదరణ పొందుతాయనే నమ్మకం ఉంది అన్నారు. మదన్‌ మాట్లాడుతూ ద్వేషించే వారిని ప్రేమించే స్థాయికి ఎదగడం చాలా కష్టం. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఈ చిత్రం చేశాం. శ్రీనివాస్‌ చెప్పిన ఈ కథ నచ్చి, సినిమా చేశాం. ఇప్పటివరకూ చేసిన చిత్రాల ద్వారా తనలో మంచి నటుడు ఉన్నాడని ఆది నిరూపించుకున్నాడు. పాత్రను ప్రేమించి చేశాడు అన్నారు. ఆది మాట్లాడుతూ స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. శ్రీనివాస్‌ ఇచ్చిన థను మదన్‌గారు అద్భుతంగా తెరకెక్కించారు. అగస్త్య మంచి పాటలిచ్చారు అన్నారు.


రీసెంట్ గా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. మళ్ళీ ఓ సారి చూడండి.ఆది చేస్తున్న ఏడవ సినిమా ‘గరం'. గతంలో ‘పెళ్ళైన కొత్తలో', ‘గుండె ఝల్లుమంది'. ‘ప్రవరాఖ్యుడు' సినిమాల డైరెక్టర్ మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఆది ఇప్పటికే తన పార్ట్ కి సంబందించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసాడు. మిగతా షూటింగ్ కూడా పూర్తయ్యింది. దాంతో ఈ చిత్ర టీం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేసారు. ప్రస్తుతం జోరుగా ఈ మూవీ డబ్బింగ్, రీ రికార్డింగ్, ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయి.


ఆది ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘మొదటిసారి నా కెరీర్లో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ చేస్తున్నాను. ఈ సినిమాలో మేము చూపించే పాయింట్ ప్రతి ఒక్క ఇంట్లోనూ జరుగుతుంది, అందుకే ఈ మూవీ పక్కాగా అందరికీ నచ్చుతున్న కాన్ఫిడెంట్ తో ఉన్నానని' ఆది అన్నాడు.


ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీనివాస్‌ గవిరెడ్డి, కెమెరా: సురేందర్‌రెడ్డిటి. సంగీతం:ఆగస్త్య, కళ: నాగేంద్ర, ఎడిటింగ్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత:బాబ్జీ, కో-డైరెక్టర్‌: అనిల్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మదన్‌.

English summary
Garam audio will be released on 23 of this month. Movie featuring Aadi, Adah Sharma, Brahmanandam and Shakalaka Shankar. Directed by Madan. Music directed by Agasthya. Produced by Surekha P.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu