»   »  ఆది 'గరం' ఫస్ట్‌లుక్‌ మోషన్ పోస్టర్‌ (వీడియో)

ఆది 'గరం' ఫస్ట్‌లుక్‌ మోషన్ పోస్టర్‌ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సాయికుమార్‌ తనయుడు ఆది, అదాశర్మ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం 'గరం' ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి మదన్‌ దర్శకత్వం వహిస్తుండగా, అగస్త్య సంగీతం అందిస్తున్నారు. ఆర్కే సినిమాస్‌ పతాకంపై రాజ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఆది మాట్లాడుతూ - ''సినిమా నిర్మాణం ఎంత కష్టమో మా హోమ్ బేనర్‌పై ఈ సినిమా నిర్మించినప్పుడు నాకు తెలిసింది. నిర్మాత లేనిదే సినిమా లేదు. అందుకే తెలుగు పరిశ్రమలో ఉన్న నిర్మాతలందరికీ ధన్యవాదాలు. నేను నిర్మాతల నటుడిగానే ఎప్పటికీ కొనసాగుతాను. అమ్మా, నాన్న, వసంతా ఆంటీ, షీలా ఆంటీల సపోర్ట్‌తో ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రకథలో ఒక ఫైర్ ఉంది. ఫుల్ గరం గరంగా ఉంటుంది. ఇందులో ఉన్న ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో చేశాం'' అని చెప్పారు.

Aadi's Garam First look Motion Poster

దర్శకుడు మదన్ మాట్లాడుతూ - ''శ్రీనివాస్ గవిరెడ్డి ఓ పాయింట్ చెబితే చాలా నచ్చింది. దాంతో ఆ కథను నేనే తెరకెక్కిస్తానని తనను అడిగాను. మనం ద్వేషించేవాళ్లని ప్రేమించే స్థాయికి ఎదగాలంటే కష్టం. ఈ చిత్రం ప్రధానాంశం ఇదే. ఆది ఎంతగానో ప్రేమించి ఈ సినిమా చేశాడు'' అని చెప్పారు.

Aadi's Garam First look Motion Poster

సాయికుమార్ మాట్లాడుతూ... ''నటుడు నర్రా వెంకటేశ్వరరావుగారి కుమార్తె వసంతా శ్రీనివాస్, నా భార్య సురేఖ, ఛాయాగ్రాహకుడు బాబ్జీ సతీమణి షీలా బాబ్జీ నిర్మాతలుగా ఆదితో 'గరం' నిర్మించారు. దర్శకుడు మదన్ చాలా మంచి అవుట్‌పుట్ ఇచ్చారు'' అని అన్నారు.

English summary
Garam, 2015 Telugu movie Motion Poster. Garam Telugu movie features Aadi & Adah Sharma in lead roles. Directed by Madan. Music directed by Agasthya. Produced by Surekha P.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu