»   » బళ్లారి నుండి ‘ఆగడు’ టీం తిరుగు ప్రయాణం

బళ్లారి నుండి ‘ఆగడు’ టీం తిరుగు ప్రయాణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆగడు' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా బళ్లారిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇక్కడ షూటింగ్ ముగియడంతో యూనిట్ సభ్యులంతా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు.

షూటింగ్ షెడ్యూల్ ముగిసిందని, ఇక్కడ ఓ సాంగుతో పాటు కొన్ని సీన్లు చిత్రీకరించారని తెలుస్తోంది. అయితే మహేష్ బాబు కాలుకు గాయం కావడం వల్ల షూటింగ్ మధ్యలో ఆపి అందరూ హైదరాబాద్ ప్రయాణం అయ్యారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అయితే యూనిట్ సభ్యులు మాత్రం ఈ విషయమై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్ వర్మ స్క్రిప్టు అందించారు. మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నాడు. ప్రముఖ నటి నదియా ఈ చిత్రంలో మహేష్ బాబు అక్క పాత్రలో కనిపించనుంది. నదియా, మహేష్ బాబు కలిసి నటించడం ఇదే తొలిసారి.

ఆగడు చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో మహేష్ బాబు, శ్రీనువైట, 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ కాంబినేషన్లో 'దూకుడు' వంటి సూపర్ హిట్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఆగడు చిత్రాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
The film unit of Mahesh Babu starrer Aagadu, Directed by Sreenu Vaitla, which had been shooting in Bellary, has wrapped up the schedule, a bit ahead of the schedule.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu