twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పు జరిగింది... సరిదిద్దుకుంటా : మహేష్ (ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : '1' కథ ఎంతగానో నచ్చి సినిమా చేయడానికి అంగీకరించాను. అయితే ఫలితం కాస్త నిరాశపరిచింది. అయితే మా ప్రయత్నాన్ని చాలా మంది మెచ్చుకున్నారు. సినిమాలో ఎక్కడో చిన్న తప్పు జరిగింది. దాన్ని సరిదిద్దుకొని మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తాను అన్నారు మహేష్ బాబు. మరో పది రోజుల్లో 'ఆగడు' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపధ్యంలో మహేష్ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    'పోకిరి'.. 'దూకుడు'.. మహేష్‌ పోలీసు చిత్రాల వరుస ఇది. సినిమా సినిమాకి పోలీసు పాత్ర నిడివి పెరుగుతోంది. సినిమా సత్తా పెరుగుతోంది. తాజాగా 'ఆగడు' అంటూ మరోసారి బాక్సాఫీసు దగ్గరకు రాబోతున్నాడు. సంభాషణలతోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు.

    ‘ఆగడు' సినిమా ట్రైలర్‌లో తను చెప్పిన డైలాగ్స్‌ చర్చనీయాంశమైన విషయంపై మహేశ్‌ స్పందించారు. ఆ డైలాగ్స్‌ను వివాదం చేయాల్సిన పనిలేదనీ, తమ ‘దూకుడు' సినిమా మీదే తాము డైలాగ్స్‌ వేసుకున్నామనీ ఆయన స్పష్టం చేశారు..ఇంకా ఆయన ఏమన్నారు..స్లైడ్ షోలో...

    వివాదం వద్దు...

    వివాదం వద్దు...

    ఇందులో పూర్తి స్థాయి పోలీసాఫీసర్‌ రోల్‌ చేశా. ‘దూకుడు'లో చేసినా, అది ఓ లెవల్‌ వరకే. ఇందులో ఔట్‌ అండ్‌ ఔట్‌ పోలీస్‌ రోల్‌. ఈ సినిమా విషయంలో మేమంతా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాం. నాకు తెలిసి నా కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్‌ హిట్టవుతుంది. ట్రైలర్‌లోని డైలాగ్స్‌తో వివాదం చేయాల్సిన పనిలేదు. మా ‘దూకుడు' మీద మేమే డైలాగ్‌ వేసుకున్నాం అన్నారు.

    ఎందుకింత యాగీ

    ఎందుకింత యాగీ

    ప్రచార చిత్రాల్లో సంభాషణల గురించి ఎందుకంత యాగీ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ విషయమై నేను ట్విట్టర్‌లోనూ సమాధానమిచ్చాను. అది ఎవరి మీదో వేసిన సెటైర్‌ కాదు. మా 'దూకుడు' మీద మేం వేసుకున్న వ్యంగ్యాత్మక సంభాషణలవి. ఇక్కడితోనైనా దీన్ని వదిలేస్తే మంచిది.

    నాన్న మెచ్చుకున్నారు

    నాన్న మెచ్చుకున్నారు


    'ఆగడు' నా సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిపోయే చిత్రమవుతుంది. నా నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అన్నీ ఇందులో ఉండేలా శ్రీను వైట్ల సినిమా తెరకెక్కించాడు. నాన్న కూడా ట్రైలర్‌ చూసి 'చాలా బాగుంది రా. డైలాగ్స్‌ అదిరిపోయాయి. సినిమా కూడా బాగుంటుంది' అన్నారు. ఇక ప్రేక్షకులే చెప్పాలి. తమన్‌ సంగీతానికి మంచి స్పందన వస్తోంది.

    అలాంటిదేం లేదు

    అలాంటిదేం లేదు

    మా సినిమా పాటల వేడుకకు శంకర్‌ అతిథిగా వచ్చారంతే. ఆయనతో నేనేదో సినిమా చేసేస్తున్నానని వార్తలొస్తున్నాయి. వాటిలో ఏమాత్రం నిజం లేదు. మా మధ్య అలాంటి డిస్కషన్స్‌ ఏమీ జరగలేదు. మేం అడగగానే చాలా పెద్ద మనసుతో మా ఆడియో ఫంక్షన్‌కు వచ్చారు. దానికి మించి మరేమీ లేదు. పోతే, ఆయన డైరెక్ట్‌ చేసిన ‘మనోహరుడు' ఆడియో ఫంక్షన్‌కు నేను వెళ్లడం లేదు. వేరే కమిట్‌మెంట్స్‌ ఉండటం వల్ల వెళ్లలేని స్థితి.

    కొత్త క్యారెక్టర్

    కొత్త క్యారెక్టర్


    నేను ఇంతవరకు చెయ్యని పాత్రను కొరటాల శివ సినిమాలో చేయబోతున్నా. ఆ స్ర్కిప్ట్‌ కానీ, ఆ ప్రాజెక్ట్‌ కానీ చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాయి. ఈ నెల 27న ఆ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. నేను అక్టోబర్‌ 3న జాయిన్‌ అవుతాను. ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.

    యస్..చేస్తున్నా

    యస్..చేస్తున్నా

    పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో సినిమా ఉంటుంది. చర్చలు నడుస్తున్నాయి. అవి అవగానే, వీలైనంత త్వరగా ఆ సినిమాని ప్రకటిస్తాం

    ఈ సారి జాగ్రత్త పడతా

    ఈ సారి జాగ్రత్త పడతా

    చాలా కొత్తగా ఉందని ఫీలై ‘1' చేశాను. నా దృష్టిలో అది ఈ కాలానికంటే చాలా ముందున్న సినిమా. అలాంటి సినిమా మరోసారి చేయాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకొని చేస్తాను.

     ఇప్పట్లో లేనట్లే...

    ఇప్పట్లో లేనట్లే...

    సాంఘిక, పౌరాణిక తరహా చిత్రాలు ఇప్పట్లో అంగీకరించను. అలాంటి ప్రాజెక్టులు ఏమీ నా దగ్గరకు రాలేదు. వచ్చినా ఇప్పుడు చెయ్యను

    కొన్నాళ్ల తర్వాత...

    కొన్నాళ్ల తర్వాత...

    'నేను.. గౌతమ్‌ మళ్లీ ఎప్పుడు కలసి నటిస్తారు' అని అందరూ అడుగుతున్నారు. మొన్నే కదా కలసి నటించాం. మళ్లీ ఇప్పుడే వద్దు. వాడు చదువుకుంటున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఆలోచిస్తాం.

    ఆగడు లేటెస్ట్ ఇన్ఫో...

    ఆగడు లేటెస్ట్ ఇన్ఫో...

    ఆగడు పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. డబ్బింగ్ కూడా ఈ రోజుతో పూర్తై పోతుంది. మహేష్ ప్రమోషన్ ఇంటర్వూలలో బిజీ అవనున్నారు. సెప్టెంబర్ 12 కి ఫస్ట్ కాపీ వచ్చి... సెప్టెంబర్ 15 కి సెన్సార్ పూర్తి అవ్వుతుంది.

    English summary
    Post-Production works of Aagadu are in full swing. The Dubbing is expected to get completed today. Mahesh will be finishing his dubbing and with that his work for 'Aagadu' will be over barring the Promotional Interviews. The Team is making all efforts to ready the first copy in time for a Sep 12th Censor and if they fail to make the deadline it will be a Sep 15th Censor for the film. The film releases on 19th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X