»   » సెక్సీ టీషర్ట్ బాగానే ఉంది గానీ.... ప్రియాంక మాత్రం చిక్కుల్లో పడింది

సెక్సీ టీషర్ట్ బాగానే ఉంది గానీ.... ప్రియాంక మాత్రం చిక్కుల్లో పడింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం హాలీవుడ్ చిత్రం ''బేవాచ్‌''లో నటిస్తోంది ప్రియాంక చోప్రా. అమెరికా టీవీ ధారావాహిక ''క్వాంటికో'' ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ సంపాందించుకున్న ఈ అమ్మడు హాలీవుడ్ వర్గాల్లో పాపులర్ అయింది. ఇటీవల ఓ అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్‌పేజీపై దర్శనమిచ్చింది ప్రియాంక చోప్రా. ఇదిలావుంటే ఈ బ్యూటీ వివాదంలో ఇరుక్కుంది. ట్రావెలర్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ అమ్మడు వేసుకున్న టీషర్ట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.

Aagazine cover featuring Priyanka Chopra 'insensitive' to refugees

విమెన్ స్పెషల్స్ నుంచి ఫ్యాషన్ మేగజైన్స్ వరకూ వరుసగా కవర్ చేసేస్తున్న ప్రియాంకా.. ఇప్పుడు కాండే నెస్ట్ వారి ట్రావెల్ మేగజైన్ పైకి కూడా ఎక్కింది. హాట్ అందాలను చూపిస్తూ అమ్మడు ధరించిన టీ షర్ట్ బాగా హాట్ గా ఉంది. కవర్ పేజ్ ఫోటోను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిందీ భామ. దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. జనాలకు అంత కోపం తెప్పించే విధంగా ఆ టీషర్ట్ పై ఏముందో తెలుసా... తెల్లటి టీషర్ట్ పై... రెఫ్యూజీ (శరణార్థి), ఇమ్మిగ్రెంట్ (వలసవాది), ఔట్ సైడర్ (బయటి వాడు), ట్రావెలర్ (ప్రయాణికుడు) అనే పదాలు ఓ బాక్స్‌లో ఉన్నాయి. వీటిలో రెఫ్యూజీ, ఇమ్మిగ్రెంట్, ఔట్ సైడర్ అనే పదాలను కొట్టివేసి... ట్రావెలర్ అనే పదం మాత్రం వదిలివేసి ఉంది.

మొదటి ముగ్గురిగా ఉండడం కంటే ట్రావెలర్‌గా ఉండడం ఇష్టమని అర్థం. ట్రావెలర్ మేగజైన్ ను హైప్ చేయడం పాయింట్ అయినా, దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతకడం కష్టమై.. పొట్టకూటి కోసం శరణార్థులుగా, వలసవాదలుగా ఇతర దేశాలను ఆశ్రయిస్తున్న వారిని తీవ్రంగా కించపరిచేలా ప్రియాంక ఆ ఫోజిచ్చిందని మండిపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే టీవీ నటీమణి అయిన ప్రియాంకకు ఓ శరణార్థి బాధ ఎలా తెలుస్తుందని నెటిజన్లు కడిగిపారేస్తున్నారు.

Aagazine cover featuring Priyanka Chopra 'insensitive' to refugees

అది చాలా రేసిస్టు భావజాలం అంటూ కామెంట్లలో తిడుతున్నారు. పైగా యు.ఎన్.ఓ. వంటి సంస్థలకు అంబాసిడర్ గా ఉన్న ప్రియాంక.. అలాంటి టి-షర్టు వేసుకోవచ్చా? వివాదాలకు దూరంగా ఉండే ప్రియాంకా ఇలా సడెన్ గా దొరికిపోవడం ఆశ్చర్యకరం. పైగా అందరూ కట్టకలసి ఆమెను బూతులు తిట్టేస్తుంటే ఫ్యాన్స్ కి మరింత భాదగా ఉందిట.

English summary
Priyanka Chopra's t-shirt in the cover photo of the latest Conde Nast Traveller issue has ruffled some Twitterati's feathers.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu