»   » నాకు బ్యాగ్రౌండ్ లేకున్నా అభిమానులున్నారు, సినిమాలో ఓ సాహసం చేసా: నాని

నాకు బ్యాగ్రౌండ్ లేకున్నా అభిమానులున్నారు, సినిమాలో ఓ సాహసం చేసా: నాని

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ దక్షిణాది సినిమా రంగంలోకి అడుగిడుతూ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ద్విబాషా చిత్రం 'ఆహా కళ్యాణం'. ఈచిత్రం ఆడియో వేడుక సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్‌లో జరిగింది. రాణా, సునీల్, దిల్ రాజు, కరుణాకరన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

నిర్మాత దిల్ రాజు ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీ హీరో సునీల్ అందుకున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ...బాలీవుడ్లో అద్భుతమైన సినిమాలు నిర్మించిన యశ్ రాజ్ సంస్థ తెలుగు, తమిళ రంగాల్లో ప్రవేశించడం సంతోషంగా ఉంది. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన నానికి ఈ సినిమా ద్వారా విజయం దక్కాలని కోరుకుంటున్నాను అన్నారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు.....

సాహసం చేసాను : నాని

సాహసం చేసాను : నాని


ఆహా కళ్యాణం సినిమాలో ఓ సాహసం చేసాను. అదేమిటో సినిమా చూస్తే మీకే అర్థం అవుతుందని హీరో నాని చెప్పుకొచ్చారు.

బ్యాగ్రౌండ్ లేక పోయినా..

బ్యాగ్రౌండ్ లేక పోయినా..


నాకు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేక పోయినా పైకొచ్చానని అంతా అంటున్నారు. మీడియా, ప్రేక్షకులకు మించిన బ్యాగ్రౌండ్ ఇంకేం ఉంటుంది....అని నాని చెప్పుకొచ్చారు.

అవి రెండు మాస్ క్యారెక్టర్లు..ఇది డిఫరెంట్

అవి రెండు మాస్ క్యారెక్టర్లు..ఇది డిఫరెంట్


దర్శకుడు గోకుల్ కృష్ణ ఈచిత్రాన్ని రీమేక్ అయినప్పటికీ మన నేటివిటీకి తగినట్లుగా తెరకెక్కించారు. నేను పైసా, జెండాపై కపిరాజు సినిమాల్లో మాస్ రోల్స్ చేసాను. వాటి మధ్యలో ఈ సినిమా చేసాను. డిఫరెంటుగా ఉంటుంది అన్నారు.

వాణి కపూర్ గురించి నాని...

వాణి కపూర్ గురించి నాని...


హీరోయిన్ వాణి కపూర్ బాష అర్థం కాకపోయినా నేర్చుకుని హావభావాలతో నటించింది. సినిమా ఫుల్‌లెంగ్త్ ఎంటర్టెన్మెంట్ మూవీ. యశ్ రాజ్ ఫిలింస్ వంటి బ్యానర్లో అవకాశం రావడం సంతోషంగా ఉంది అన్నారు.

వాణి కపూర్

వాణి కపూర్


వాణి కపూర్ మాట్లాడుతూ...ఇది వరకు నేను బాలీవుడ్ సినిమాలు చేసాను. ఆహా కళ్యాణం ద్వారా దక్షిణాదిలో తెలుగు, తమిళ సినిమా రంగాలకు పరిచయం అవుతున్నాను. నాని మంచికోస్టార్. యూనిట్ సభ్యులంతా ఎంతో సపోర్ట్ చేసారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలి అన్నారు.

సంగీత దర్శకుడు

సంగీత దర్శకుడు


యశ్ రాజ్ ఫిలింస్ లాంటి సంస్థలో పని చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని సంగీత దర్శకుడు ధరన్ కుమార్ అన్నారు. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనే ఆశా భావం వ్యక్తం చేసాడు.

English summary
Aaha Kalyanam Audio Release Function held at Hyderabad. Actor Nani, Actress Vaani Kapoor, Director A.Gokul Krishna, Music Director Dharan Kumar, Rana Daggubati, A.Karunakaran, Sunil, Dil Raju, Anchor Suma graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu