»   » నాని, వాణీ కపూర్ ‘ఆహా కళ్యాణం’ ప్రెస్ మీట్ (ఫోటోలు)

నాని, వాణీ కపూర్ ‘ఆహా కళ్యాణం’ ప్రెస్ మీట్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని, వాణి కపూర్ నటించిన 'ఆహా కళ్యాణం' చిత్రం ఈ నెల 21న విడుదలవుతున్న నేపథ్యంలో ఈచిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో చిత్రం యూనిట్ సభ్యులు ఆడియో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా హీరోయిన్ వాణి కపూర్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. నాభి అందాలను ప్రదర్శిస్తూ ఫోటోలు ఫోజులు ఇచ్చింది.

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ...మామూలు సినిమాల కంటే ఒక హిట్ చిత్రాన్ని రీమేక్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఒరిజినల్ సినిమాతో పోలిస్తే ఈ చిత్రం చాలా ఫ్రెష్‌గా, డిఫరెంట్ లుక్‌తో ఉంటుంది. హిందీ వెర్షన్ బ్యాండ్ బాజా భారత్ చిత్రం ఢిల్లీ బ్యాక్ డ్రాపుతో నడుస్తుంది. తెలుగు వెర్షన్ సౌతిండియా బ్యాక్ డ్రాపుతో నడుస్తుంది. నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేయడం జరిగింది. హిందీ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ మరింత వినోదాత్మకంగా ఉంటుందని నాని తెలిపారు.

ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చిందని, సినిమా అందరికీ నచ్చే ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేసారు నాని. ప్రెస్ మీట్‌కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

ఆహా కళ్యాణం

ఆహా కళ్యాణం


నాని, వాణి కపూర్ జంటగా తెలుగు, తమిళంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆహా కళ్యాణం'. హిందీలో హిట్టయిన బ్యాండ్ బాజా భారత్ చిత్రానికి రీమేక్‌గా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది.

యశ్ రాజ్ ఫిలింస్

యశ్ రాజ్ ఫిలింస్


యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ సౌత్ లో నిర్మిస్తున్న తొలి సినిమా ఇదే. సౌత్‌లో నిర్మిస్తున్న తొలి చిత్రం మంచి ఫలితాలను ఇస్తుందనే నమ్మకంతో ఉంది ఆ సంస్థ.

సెన్సార్ రిపోర్ట్

సెన్సార్ రిపోర్ట్


‘ఆహా కళ్యాణం' చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈచిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసారు

విడుదల

విడుదల


ఈ నెల 21న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. తమిళ,తెలుగు భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ధరణ్ కుమార్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

వాణీ కపూర్ గురించి నాని

వాణీ కపూర్ గురించి నాని


వాణి కపూర్ గురించి నాని మాట్లాడుతూ....వాణి కపూర్ ఎంతో అంకిత భావంతో పని చేసింది. సినిమా విడుదలకు ముందే ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది అని తెలిపారు.

దర్శకుడి గురించి

దర్శకుడి గురించి


నాని మాట్లాడుతూ దర్శకుడు గోపాల్ కృష్ణ ఈ చిత్రాన్ని రీమేక్ అయినప్పటికీ మన నేటివిటీకి తగ్గ విధంగా తెరకెక్కించారు. నేను పైసా, జెండాపై కపిరాజు సినిమాల్లో మాస్ రోల్స్ చేశాను. ఆ సినిమాల మధ్యలోఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది.

హీరోయిన్ వాణి కపూర్ మాట్లాడుతూ...

హీరోయిన్ వాణి కపూర్ మాట్లాడుతూ...


యశ్ రాజ్ లాంటి సంస్థలో పనిచేసే ఛాన్స్ రావడం నా అదృష్టం. నాని లాంటి టాలెంటెడ్ హీరోతో ఇంట్రడ్యూస్ అవుతున్నా వెరీ హ్యాపీ. నా పేరు సౌత్ ఇండియన్ లా ఉంది కాబట్టి తెలుగు ప్రేక్షకులకు తొందరగానే దగ్గరౌతాను. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా ఇది.

కథలో మార్పులు చేసారా?

కథలో మార్పులు చేసారా?


అయితే ఈ సినిమాలోని కథతో ఆల్రెడీ ఓ సినిమా వచ్చింది కదా... ఆహా కళ్యాణంలో కొత్తగా ఏం చెబుతున్నారని చాలామంది అడుగుతున్నారు. మనకున్నవి నాలుగైదు కథలే. వాటితోనే వేల సినిమాలను రూపొందించారు. మాది అంతే... సినిమా నచ్చితేనే చూడండి. వేరే విషయాల్ని ఆహా కళ్యాణంకు ఆపాదించకండి.

పాటల రచయిత కృష్ణచైతన్య మాట్లాడుతూ...

పాటల రచయిత కృష్ణచైతన్య మాట్లాడుతూ...


యశ్ రాజ్ సంస్థ నాకు అవకాశమిచ్చింది. థాంక్స్. వాణి, నాని సూపర్ గా చేశారని చెప్పారు. పాటలు సూపర్ హిట్టయ్యాయి. సవారి సవారి...విరిసే విరిసే పాటలంటే నాకు బాగా ఇష్టం. అని అన్నారు.

పాటల రచయిత కృష్ణచైతన్య మాట్లాడుతూ...

పాటల రచయిత కృష్ణచైతన్య మాట్లాడుతూ...


యశ్ రాజ్ సంస్థ నాకు అవకాశమిచ్చింది. థాంక్స్. వాణి, నాని సూపర్ గా చేశారని చెప్పారు. పాటలు సూపర్ హిట్టయ్యాయి. సవారి సవారి...విరిసే విరిసే పాటలంటే నాకు బాగా ఇష్టం. అని అన్నారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


ఈ సినిమాకు కెమెరాః లోకనాధన్ శ్రీనివాసన్, సంగీతం:ధరణ్ కుమార్, డైలాగ్స్: శశాంక్ వెన్నెలకంటి, సాహిత్యం: కృష్ణచైతన్య, రాఖేందు మౌళి, క్రియేటివ్ ప్రొడ్యూసర్: విజయ్ అమృతరాజ్, నిర్మాతః ఆదిత్య చోప్రా,స్ర్కీన్ ప్లే, హబీబ్ ఫైజల్: దర్శకత్వం: గోకుల్ కృష్ణ.

English summary
Aaha Kalyanam movie audio success Meet held at Hyderabad. Actor Nani, Actress Vaani Kapoor, Director A.Gokul Krishna, Music Director Dharan Kumar graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu