»   » అక్కినేనికి రెస్పెక్ట్: ‘ఆహా కళ్యాణం’ ఆడియో ఎప్పుడంటే?

అక్కినేనికి రెస్పెక్ట్: ‘ఆహా కళ్యాణం’ ఆడియో ఎప్పుడంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని, వాణి కపూర్ జంటగా తెలుగు, తమిళంతో తెరకెక్కుతున్న చిత్రం 'ఆహా కళ్యాణం'. హిందీలో హిట్టయిన బ్యాండ్ బాజా భారత్ చిత్రానికి రీమేక్‌గా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంస్థ సౌత్ లో నిర్మిస్తున్న తొలి సినిమా ఇదే.

ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో విడుదల ఈ నెల 23న జరుగాల్సి ఉండగా....అక్కినేని మరణంతో ఆడియో విడుదల కార్యక్రమాన్ని రద్దు చేసారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 27న ఆడియో విడుదల కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నోవాటెల్ హోటల్‌లో ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరుగనుంది.

Aaha Kalyanam

ఈ చిత్రంలో ఇకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. తమిళ,తెలుగు భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ధరణ్ కుమార్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సినిమాకు కెమెరాః లోకనాధన్ శ్రీనివాసన్, సంగీతం:ధరణ్ కుమార్, డైలాగ్స్: శశాంక్ వెన్నెలకంటి, సాహిత్యం: కృష్ణచైతన్య, రాఖేందు మౌళి, క్రియేటివ్ ప్రొడ్యూసర్: విజయ్ అమృతరాజ్, నిర్మాతః ఆదిత్య చోప్రా,స్ర్కీన్ ప్లే, హబీబ్ ఫైజల్: దర్శకత్వంః గోకుల్ కృష్ణ.

English summary
Nani, Vaani Kapoor starrer Aaha Kalyanam audio is going to be launched on January 27 in Novotel, Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu