»   » అక్కినేని మరణంతో ‘ఆహా కళ్యాణం’ ఆడియో వాయిదా!

అక్కినేని మరణంతో ‘ఆహా కళ్యాణం’ ఆడియో వాయిదా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగేశ్వరరావు మరణం కారణంగా 'ఆహా కళ్యాణం' ఆడియో విడుదల వాయిదా పడింది. గురువారం అక్కినేని అంత్యక్రియలు జరుగనున్న నేపథ్యంలో ఈ రోజు విడుదల కావాల్సిన ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిలిపివేసారు.

యశ్ రాజ్ ఫిలింస్ ఫిలింస్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు దక్షణాదిన నిర్మిస్తన్న ద్విభాషా చిత్రం "ఆహా కళ్యాణం'' ఈ సినిమా హిందీలో రూపొందిన ""బ్యాండ్ బాజా బరాత్'' సినిమాక్ కు ఇది రీమేక్ గా రూపొందనుంది. నాని కథా నాయకుడిగా వాణీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Aaha Kalyanam’s audio launch postponed

ఈ చిత్రంలో ఇకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. తమిళ,తెలుగు భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ధరణ్ కుమార్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సినిమాకు కెమెరాః లోకనాధన్ శ్రీనివాసన్, సంగీతం:ధరణ్ కుమార్, డైలాగ్స్: శశాంక్ వెన్నెలకంటి, సాహిత్యం: కృష్ణచైతన్య, రాఖేందు మౌళి, క్రియేటివ్ ప్రొడ్యూసర్: విజయ్ అమృతరాజ్, నిర్మాతః ఆదిత్య చోప్రా,స్ర్కీన్ ప్లే, హబీబ్ ఫైజల్: దర్శకత్వంః గోకుల్ కృష్ణ.

English summary

 Nani, Vaani Kapoor starrer Aaha Kalyanam audio launch has been postponed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu