»   » పోరి..టపోరి: ఓ లవ్ స్టోరీ(వీడియో)

పోరి..టపోరి: ఓ లవ్ స్టోరీ(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :పూరి ఆకాష్, ఉల్కా గుప్తా జంటగా నటిస్తున్న చిత్రం ఆంధ్రాపోరి. రాజ్ మాదిరాజు దర్శకుడు. ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రమేష్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో గురువారం ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం రాత్రి శిల్పారామం రాక్ హైట్స్ లో జరిగింది. ఈ సందర్బంగా చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ విభిన్నంగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంది. మీరు ఇక్కడ ఆ ట్రైలర్ ని వీక్షించండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడుదర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ.. వయసులో హీరో హీరోయిన్లు యంగ్ అయినా విపరీతమైన అనుభవం ఉంది. పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి నటించారు. ఎవరినీ కించపరచడానికి, వివాదాలు రేకెత్తించడానికి ఆంధ్రాపోరి టైటిల్ పెట్టలేదు. ఓ తెలంగాణ అబ్బాయి తనను అమితంగా ప్రేమించిన, తాను అమితంగా ప్రేమించిన ఆంధ్రా అమ్మాయిని ముద్దుగా పిలుచుకునే పేరు. అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు. కలెక్షన్స్ కోసం ప్రసాద్ ప్రొడక్షన్స్ కి ఇలా చేయవలసిన అవసరం లేదు అని అన్నారు.


రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ.... రాజ్ మాదిరాజుతో నేను నిర్మిస్తున్న రెండవ చిత్రమిది. తొలి చిత్రం ఋషి అంతగా రాణించలేకపోయినా అతని ప్రతిభ ఏమిటో నాకు తెలుసు అందుకే అతనితో రెండవ చిత్రాన్ని నిర్మిస్తున్నాను అన్నారు.


Aakash Puri 's Andhra Pori Theatrical Trailer

అలాగే...మరాఠీ ఫిల్మ్ టైమ్ పాస్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మా నాన్నగారు, మా కుటుంబం అంతా సినిమాకే అంకితం అయ్యాం. సినిమా వల్లే ఈ రోజు ఇక్కడ నిలబడినందుకు చాలా ఆనందంగా వుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ప్రసాద్ సంస్థలో నేను చేస్తున్న రెండవ చిత్రమిది. కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకముంది అన్నారు.


డా.శ్రీకాంత్, పూర్ణిమ, ఈశ్వర్‌రావ్, అరవింద్‌కృష్ణ,ఊర్మిళ కనిత్కర్, ఉత్తేజ్, అభినయ, శ్రీతేజ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం:ప్రవీణ్ వనమాలి, సంగీతం:డా.జె, ఆర్ట్:రాజీవ్ నాయర్, డ్యాన్స్:చంద్రకిరణ్, సాహిత్యం:సుద్దాల అశోక్‌తేజ,రామజోగయ్యశాస్త్రి, కిట్టు విస్సా ప్రగడ, కృష్ణ మదినేని, చక్రవర్తుల.

English summary
Aakash Puri 's Andhra Pori Theatrical Trailer released. Akash Puri Ulka gupta's Andhra Pori completed shooting formalities. The film is a Remake of Successful Marathi Film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu