»   »  టాలీవుడ్ నటి సంచలన ఆరోపణలు.. నా కాపురంలో నిప్పులు పోశారు!

టాలీవుడ్ నటి సంచలన ఆరోపణలు.. నా కాపురంలో నిప్పులు పోశారు!

Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీకి కాల్ డేటా కేసులో చిక్కులు ఎక్కువవుతున్నాయి. తన భార్యపై రహస్య నిఘా పెట్టి ఆమె కాల్ డేటా దొంగిలించిన కేసులో నవాజుద్దీన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడి లాయర్ రిజ్వాన్ పై కూడా ఈ కేసు నమోదైంది. తాజగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఆకృతి నాగ్ పాల్ రిజ్వాన్ పై సంచలన ఆరోపణలు చేసింది.

Aakruthi Nagpal sensational comments on Nawazuddin Siddiquis lawyer

రిజ్వాన్ తన కాల్ డేటాని కూడా దొంగిలించారని ఆమె కేసు నమోదుచేయడంతో అతడికి మరింతగా ఉచ్చుబిగుసుకున్నట్లు అయింది. ఆకృతి 2014 లో అనిల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. మనస్పర్థల కారణంగా అతడి నుంచి ఆకృతి విడిపోయింది. తన వివాహ జీవితం నాశనం కావడానికి కారణం రిజ్వాన్ అంటూ ఫిర్యాదు చేసింది. తన కాల్ డేటాని దొంగిలించి, అనిల్ కు తనపై లేనిపోని అనుమానాలు కలిగేలా చేసాడని ఆరోపించింది. రిజ్వాన్, అనిల్ ఇద్దరూ స్నేహితులని ఆకృతి పోలీస్ ఫిర్యాదులో తెలిపింది. అనిల్ మరో యువతితో సంబంధం పెట్టుకునేలా రిజ్వాన్ ప్రోత్సహించినట్లు కూడా ఆకృతి ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.

English summary
Aakruthi Nagpal sensational comments on Nawazuddin Siddiqui's lawyer. She files case on Rizwan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X