For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ చేయించిన త్రివిక్రమ్, సునీల్... పెద్ద గొడవ, మానిక్ రెడ్డి సెటిల్మెంట్!

  |

  'అరవింద సమేత' సినిమా చూసిన వారికి ఎన్టీఆర్, సునీల్, జగపతి బాబు లాంటి స్టార్లు చేసిన పెర్ఫార్మెన్స్ గుర్తుండి పోవడం సర్వ సాధారణం. ఈ సినిమాలో కనిపించిన ఒక కొత్త కమెడియన్ కేవలం ఒకే ఒక్క డైలాగుతో పాపులర్ అయ్యారు. 'ఆకు తిను.... పోక తిను' అంటూ విభిన్నమైన పెర్ఫార్మెన్స్‌తో అందరికీ గుర్తుండి పోయాడు. ఆ కమెడియన్ పేరు మానిక్ రెడ్డి. ఇతడు ఎవరో కాదు... త్రివిక్రమ్, సునీల్ పంజాగుట్టలో ఉంటూ సినిమా అవకాశాల కోసం స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో పరిచయమైన ఫ్రెండ్. 'ఆకు తిను' డైలాగ్ ఐడియా కూడా పదేళ్ల క్రితం త్రివిక్రమ్‌కు మానిక్ చెబితే... ఇపుడు అరవింద సమేతలో స్వయంగా అతడితోనే దాన్ని చేయించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మానిక్ రెడ్డి త్రివిక్రమ్, సునీల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

  ‘ఆకు తిను' ఐడియా అలా వచ్చిందట

  ‘ఆకు తిను' ఐడియా అలా వచ్చిందట

  నేను హైదరాబాద్ పాతబస్తీలోని అలియాబాద్ అనే ప్రాంతంలో పుట్టి పెరిగాను. లాల్ దర్వాజ ప్రాంతంలో ఒక పహిల్వాన్ ఉండేవారు. అక్కడ ఓ రియల్ ఎస్టేట్ సెట్మెంట్ జరుగుతుండగా నేను వెల్లాను. మర్యాద అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. కొన్ని చోట్ల కాఫీ తాగండి అంటారు, మరికొన్ని చోట్ల టీ తాగుతారా అని అడుగుతారు. అక్కడ ‘ఆకు తిను' అని నన్ను అడిగారు, నాకు అలవాటు లేదంటే ‘పోక తిను' అను అన్నారు. ఆ సంఘటన గురించి త్రివిక్రమ్‌కు పదేళ్ల క్రితం చెబితే ఇపుడు ఈ సినిమాలో వాడినట్లు మానిక్ రెడ్డి తెలిపారు.

  300 పాన్లు(కిల్లి) తిని ఇబ్బంది పడ్డాను

  300 పాన్లు(కిల్లి) తిని ఇబ్బంది పడ్డాను

  నాకు పాన్ అలవాటు లేదు. ‘ఆకు తిను' సీన్ కోసం 12 రోజులు షూటింగ్ చేశారు. మూడు సార్లు చెప్పిన డైలాగ్ కోసం 300 పాన్లు(కిల్లీలు) తినడంతో నోరు పగలిపోయింది. తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాను. అయిపోయిందిలే అని ఊపిరి పీల్చుకున్న తర్వాత డబ్బింగ్ సమయంలో నేచురాలిటీ కోసం మళ్లీ 20 పాన్లు తెప్పించారని మానిక్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

  త్రివిక్రమ్‌తో పరిచయం అలా...

  త్రివిక్రమ్‌తో పరిచయం అలా...

  త్రివిక్రమ్ పంజాగుట్ట ప్రాంతంలో ఉన్నపుడు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ చాలా కష్టపడ్డారు. ఆ సమయంలో నాగార్జున దగ్గర ఉండే కో డైరెక్టర్ శేషు ద్వారా నాకు త్రివిక్రమ్ పరిచయం అయ్యారు. అలా నాకు త్రివిక్రమ్, సునీల్ ఫ్రెండ్స్ అయ్యారు.

  ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ చేస్తే పెద్ద గొడవైంది

  ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ చేస్తే పెద్ద గొడవైంది

  ఆ సమయంలో త్రివిక్రమ్, సునీల్ కలిసి భీమవరంకు చెందిన వారి ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ చేశారు. ఈ విషయం తెలిసి భీవవరం నుండి సుమోల్లో అమ్మాయి తరుపు వారు త్రివిక్రమ్ రూముకు వచ్చి గొడవ చేశారు. ఆ సమయంలో నాకు సునీల్ ఫోన్ చేయడంతో పది మందితో ఓ వ్యాన్ వేసుకుని వెళ్లాను. ఆ తర్వాత అంతా సెటిల్మెంట్ చేశామని... మానిక్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

   ‘అతడు'లో ఆ సీన్ అలా డిజైన్ చేశాడట

  ‘అతడు'లో ఆ సీన్ అలా డిజైన్ చేశాడట

  పంజాగుట్టలో ఉన్నపుడు త్రివిక్రమ్ తరచూ ఓల్డ్ సిటీ వెళ్దామనేవాడు. అతడికి కొత్త విషయాలపై, కొత్త ప్రాంతాలపై ఆసక్తి ఎక్కువ. చార్మినార్ వద్ద మేము జ్యూస్ తాగుతుండగా అక్కడ పని చేసే పదేళ్ల అబ్బాయిని కొంతసేపు అలా గమనించాడు. అతడు ఇతర పిల్లలు స్కూలుకు తమ అమ్మా నాన్నలతో కారులో స్కూలుకు వెళుతుంటే చూస్తున్నాడు. వెంటనే అతడికి రూ. 100 తీసిచ్చాడు. ఆ ఇన్సిడెంట్ నుంచి ఇన్‌స్పైర్ అవ్వడం ద్వారా అతడులో హీరో చిన్నప్పటి సీన్ డిజైన్ చేశాడు అని మానిక్ రెడ్డి గుర్తు చేసుకున్నాడు.

  English summary
  Aaku Thinu comedian Manik Reddy about Trivikram. Trivikram Srinivas is an Indian film screenwriter, dialogue writer, advertising and film director known for his works exclusively in Telugu cinema. Manik Reddy play comedian role in Trivikram latest movie Aravinda Sametha.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more