»   » తమ్ముడికి డ్రగ్స్ ఇస్తున్నాడనే వార్తలను ఖండించిన అమీర్

తమ్ముడికి డ్రగ్స్ ఇస్తున్నాడనే వార్తలను ఖండించిన అమీర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌పై షాకింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మానసిక వ్యాధితో బాధ పడుతున్న తన తమ్ముడు ఫైజల్ ఖాన్‌ను గృహ నిర్భంధంలో ఉంచి చికిత్స చేయిస్తున్నాడని, ఇందులో భాగంగా మెడికల్ డ్రగ్స్ ఇస్తున్నాడని బాలీవుడ్ సర్కిల్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలపై షాకైన అమీర్ ఖాన్ వివరణ ఇచ్చారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, తన తమ్ముడు ఆరోగ్యంగానే ఉన్నాడని, తన సినిమాలకు సంబంధించిన స్క్రిప్టు ఎంపికలో ఫైజల్ సహకరిస్తున్నాడని, ధూమ్-3 స్క్రిప్టు ఎంపిక విషయంలో ఫైజల్ కీలక పాత్ర పోషించాడని, ఫైజల్ ఓకే చేసాకే తాను ఈ సినిమా చేయడానికి అంగీకరించానని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. తమ్ముడు మళ్లీ సినిమాల్లో నటిస్తారా? లేదా? అనే విషయాన్ని అతన్నే అడిగితే బాగుంటుందని అమీర్ ఖాన్ తెలిపారు.

Aamir Khan

ఇక అమీర్ ఖాన్ ధూమ్-3 సినిమా విషయానికొస్తే...కేవలం విడుదలైన మూడు రోజుల్లో వంద కోట్ల రూపాయల కలెక్షన్లు అందుకొని రికార్డులు తిరగరాసిన 'ధూమ్‌ 3', అదే స్పీడ్‌తో ముందుకు వెళుతోంది. అత్యంత వేగంగా వంద కోట్ల రికార్డును అందుకొన్న చిత్రంగా 'ధూమ్‌ 3'ని చెప్పుకోవచ్చు. తాజాగా మరో రికార్డును చెరిపేసింది, అందుకుంది. విడుదలైన రెండు వారాల్లో దేశవ్యాప్తంగా వచ్చిన వసూళ్లు..252.70 కోట్ల రూపాయలు. ఇందులో తమిళ, తెలుగు భాషా డబ్బింగ్‌ కలెక్షన్లు కూడా ఉన్నాయట.

గత ఏడాది డిసెంబరు 20న రిలీజైన ఈ చిత్రానికి విజరు కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. 4 వేల స్కీన్లలో విడుదల చేశారు. అభిషేక్‌ బచ్చన్‌, అమీర్‌ఖాన్‌, ఆదిత్యచోప్రా, కత్రినాకైఫ్‌ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారున. వంద కోట్ల రూపాయల బడ్జెట్‌తో సినిమాను తీశారు.

English summary
Aamir Khan, who is riding high on the success of 'Dhoom 3', says all is well between him and actor-brother Faisal, who helps him in selecting scripts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu