»   » అమితాబ్ మరో సాహసం.. ఈ వయసులో రిస్కు అవసరమా?

అమితాబ్ మరో సాహసం.. ఈ వయసులో రిస్కు అవసరమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ అంటే యాంగ్రీయంగ్ మ్యాన్. 80, 90 దశకాలలో ఫైట్లతో బిగ్ బి ఇరగ దీసిన విషయం అందరికీ తెలిసిందే. కూలీ సినిమా ప్రమాదం తర్వాత అమితాబ్ ఫైట్లకు, యాక్షన్ సీక్వేన్స్ లకు చాలా దూరంగా ఉన్నారు. మళ్లీ చాలా రోజుల తర్వాత అమితాబ్ కత్తి కాంతారావు అవతారం ఎత్తడం విశేషం.

బిగ్ బీ, మిస్టర్ పర్ ఫెక్ట్ కలిసి..

బిగ్ బీ, మిస్టర్ పర్ ఫెక్ట్ కలిసి..

బాలీవుడ్ లో బిగ్ బీ, మిస్టర్ పర్ ఫె క్ట్ అమీర్ ఖాన్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. వీరిద్దరూ పిరియాడిక్ ఫిల్మ్ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ కోసం జత కట్టారు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం కోసం ఈ ఇద్దరు సూపర్ స్టార్లు కత్తులు దూసుకుంటున్నారనేది బాలీవుడ్ సమాచారం.

ఇద్దరు యాక్షన్ సీక్వేన్స్ లు...

ఇద్దరు యాక్షన్ సీక్వేన్స్ లు...

అమీర్, అమితాబ్ సినిమాలను ఓ సారి పరిశీలిస్తే వీరిద్దరూ ఆ మధ్య కాలంలో యాక్షన్ సీక్వేన్స్ లో నటించిన దాఖలాలు లేవు. అమితాబ్ పూరి దర్శకత్వం వహించిన బుడ్డా హోగా తేరా బాప్ సినిమాలో యాక్షన్ హీరోగా కనిపించారు. అలాగే అమీర్ ధూమ్ 3 లో యాక్షన్ హీరోగా దంగల్ లో కొంత కుస్తీ పట్లు పట్టారు.

అభిమానులకు పండగే..

అభిమానులకు పండగే..

అమితాబ్, బిగ్ బీ పాల్గొన్న ఫైట్స్ సీక్వేన్స్ లు ఇటీవల ముంబైలో ఓ స్టూడియోలో చిత్రీకరించారు. ఈ ఇద్దరు అగ్రనటులు కత్తిసాము చేసినట్లు సమాచారం. వీరు చేసిన యాక్షన్, సీన్లు, స్టంట్లు తెర మీద అభిమానులకు పండగే అనే మాట వినిపిస్తున్నది.

భారీగా ఖర్చు...

భారీగా ఖర్చు...

థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రంలో కీలకమైన ఫైట్లను అత్యంత సాంకేతిక పరి నంతో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీటి కోసం భారీగా ఖర్చు పెడుతున్నారని బాలీవుడ్ వర్గాల కథనం. వయసు మీద పడిన అమితాబ్ తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కత్తి యుద్ధాలు చేయడం అవసరమా నే ప్రశ్న వినిపిస్తున్నది.

English summary
Amitabh Bachchan and Aamir Khan sharing screen space for the first time in Thugs Of Hindostan has already created a lot of excitement among cinegoers. Now, we hear, the two actors will be seen doing intense action scenes in the period film. This action-adventure film, both the actors will engage in a sword fight. They are currently shooting the sequence in Mumbai
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu