»   » అమీర్ ఖాన్ కూతురు వేసిన పెయింటింగ్ (ఫోటో)

అమీర్ ఖాన్ కూతురు వేసిన పెయింటింగ్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అమీర్ ఖాన్ కూతురు ఇరా సినిమా రంగంలోకి ఇంకా అడుగు పెట్టకున్నప్పటికీ... ఆమె చేసే పలు కార్యక్రమాలతో వార్తల్లో వ్యక్తిగా మారుతోంది. అమీర్ మొదటి భార్య రీనా కూతురే ఇరా. తండ్రి మాదిరిగానే పలు స్వచ్ఛంద సేవా సంస్థల కోసం తనవంతు సాయం చేస్తోంది.

తాజాగా ఆమె వేసిన పేయింటింగ్స్ ఎగ్జిబిషన్ పెట్టింది. తద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా ఆమె స్వచ్ఛంద కార్యక్రమాలకు ఉపయోగించనున్నట్లు టాక్. ఇందులో ఓ పెయింటింగును స్వయంగా అమీర్ కాన్ కొనుగోలు చేసారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఆనందపడిపోయారు.

ఇరా..సినిమాల్లోకి వస్తుందా? అనే ప్రశ్నకు గతంలో ఓ సారి అమీర్ ఖాన్ స్పందిస్తూ... తన కూతురు ఇరా బాలీవుడ్ లోకి ప్రవేశిస్తే సంతోషిస్తానని చెప్పారు. అమీర్ మొదటి భార్య రీనా కూతురే ఇరా. వీరిద్దరికి జునాయిద్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అలాగే, రెండో భార్య కిరణ్ రావు ద్వారా అజాద్ అనే మరో కొడుకు కూడా ఉన్నాడు.

తన పిల్లలు ఏం చేయాలనుకుంటే అది చేస్తారని, వారిపై తాను ఎలాంటి ఒత్తిడి తీసుకురానని అమీర్ చెప్పారు. వారు సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే సంతోషిస్తానన్నారు. అలా అయితే, వారితో కలిసి నటించవచ్చని.. అది అంతులేని ఆనందాన్నిస్తుందన్నారు.

English summary
Superstar Aamir Khan’s daughter Ira is holding her debut art exhibition in Mumbai and the proud father managed to purchase one painting of hers.
Please Wait while comments are loading...