twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిగ్గుపడాల్సిందేమి లేదు.. నా చేతిలో ఉన్నది అదే.. అమితాబ్, షారూఖ్‌లకు సవాల్: అమీర్

    |

    Recommended Video

    అమితాబ్, షారూఖ్‌లకు అమీర్ సవాల్, శానిటరీ నాప్‌కిన్‌ చేతిలో పట్టుకుని

    ఒక పాపులర్ తెలుగు సినిమాలో.. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థిని స్కర్టుపై కొంతమంది ఆకతాయిలు రెడ్ ఇంక్ చల్లి శునకానందం పొందుతారు. ఆకతాయిల చర్యకు విద్యార్థిని తలదించుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది.

    నిజానికి శునకానందం పొందిన ఆ ఆకతాయిల కన్నా.. అలాంటి సీన్ పెట్టినందుకు దర్శకుడే సిగ్గుపడాలేమో!.. 'రుతుస్రావం' అనే సెన్సిటివ్ అంశాన్ని పురుషులు నవ్వుకునే ఓ జోక్ లాగా.. 'స్త్రీ'లు అవమానంగా ఫీలయ్యే విషయంలాగా చిత్రీకరించినందుకు. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన సినిమా ఒకటి రాబోతోంది.. అదే 'ప్యాడ్ మ్యాన్'.

    దేశంలో ఆయనో విప్లవం: కోట్ల మంది మహిళలకు భరోసానిచ్చిన మహనీయుడు..

    ప్యాడ్ మ్యాన్:

    ప్యాడ్ మ్యాన్:

    చుట్టూ నలుగురున్న చోట 'నెలసరి' సమస్య గురించి మాట్లాడటమే మనదేశంలో పెద్ద సాహసం. ఇప్పటికీ ఆ సమస్యలపై నోరు విప్పడానికి చాలామంది మహిళలకు బిడియం అడ్డువస్తుంది. అంతకుమించి అదో మాట్లాడకూడని విషయం లాగే చూస్తారు. దీన్ని బద్దలు కొట్టిన అరుణాచలం మురుగనాథం జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమే 'ప్యాడ్ మ్యాన్'.

    మా ఆయన తప్ప.., ఎవరైతే బాగుంటుందని: అక్షయ్ భార్య ఇంట్రెస్టింగ్..మా ఆయన తప్ప.., ఎవరైతే బాగుంటుందని: అక్షయ్ భార్య ఇంట్రెస్టింగ్..

    ఛాలెంజ్ స్వీకరించిన అమీర్:


    'ప్యాడ్ మ్యాన్' చిత్రం ద్వారా మహిళల్లో.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళల్లో 'రుతుస్రావం'పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్వింకిల్ ఖన్నా విసిరిన 'ప్యాడ్‌మ్యాన్' ఛాలెంజ్‌ను ఆమీర్ ఖాన్ స్వీకరించారు. శానిటరీ నాప్‌కిన్‌ చేతిలో పట్టుకుని తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు.

    సిగ్గు పడాల్సిందేమి లేదు..:

    సిగ్గు పడాల్సిందేమి లేదు..:

    తన ఫోటోతో పాటు ఒక సందేశాన్ని కూడా అమీర్ ఖాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 'అవును నాచేతిలో ఉన్నది శానిటరీ ప్యాడే. ఇందులో సిగ్గు పడాల్సిందేమి లేదు. మీరూ ఈ మెసేజ్‌ని షేర్ చేసి మీ స్నేహితులకు ఛాలెంజ్ విసరండి.. నేను అమితాబ్, షారూఖ్, సల్మాన్‌లకు ఛాలెంజ్ విసురుతున్నాను' అని అమీర్ తెలిపారు.

    అమితాబ్, షారూఖ్ సవాల్ స్వీకరిస్తారా?:

    అమితాబ్, షారూఖ్ సవాల్ స్వీకరిస్తారా?:

    సామాజిక ఇతివృత్తంతో నిర్మిస్తున్న చిత్రం కావడంతో అమీర్ ఖాన్ ఈ సవాల్ స్వీకరించారు. అమితాబ్, షారుఖ్ లాంటి స్టార్స్ కూడా ఈ ప్రచారానికి తోడైతే.. 'ప్యాడ్ మ్యాన్' ద్వారా చాలామంది మహిళల్లో అవగాహన కలుగుతుంది. అమీర్ ఛాలెంజ్ విసిరాడు.. ఇక అమితాబ్.. షారూఖ్ ఈ ఛాలెంజ్ స్వీకరిస్తారో.. లేదో.. చూడాలి.

    అవగాహన కల్పించేలా..:

    అవగాహన కల్పించేలా..:

    మహిళల నెలసరి సమస్యలపై తెరకెక్కించిన చిత్రం కావడంతో.. దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని మహిళలందరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రదర్శించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా గ్రామీణ మహిళలు ఇంకా వెనుకబాటు తనంలోనే ఉండటంతో.. ఇలాంటి సినిమాలు వారిలో అవగాహన పెంచుతాయంటున్నారు.

    రిలీజ్ డేట్:

    రిలీజ్ డేట్:

    అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'ప్యాడ్ మ్యాన్' సినిమా ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. నిజానికి జనవరి 25నే ఈ సినిమా రావాల్సి ఉన్నా.. 'పద్మావత్' కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. 'ప్యాడ్ మ్యాన్'లో రాధికా ఆప్టే అక్షయ్ భార్యగా నటిస్తుండగా.. సోనమ్ కపూర్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.

    English summary
    The makers have applied a strategy to promote their movie – the #PadMan challenge. In this challenge, a man has to hold a pad, pose for the camera and challenge his friends.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X