»   »  వేరే ప్రాజెక్టులో బిజీ...అందుకే జాకీచాన్‌ కు నో చెప్పా

వేరే ప్రాజెక్టులో బిజీ...అందుకే జాకీచాన్‌ కు నో చెప్పా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : గత కొద్ది రోజులుగా అమీర్ ఖాన్, జాకీ ఛాన్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చర్చలు అయితే జరిగాయి కానీ... తను వేరే ప్రాజెక్టులో బిజీగ ఉండటం వల్ల తాను చేయలేకపోతున్నట్లు అమీర్ ఖాన్ తెలిపారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇండో-చైనీస్‌ చిత్రం 'కుంగ్‌ఫూ యోగా'లో జాకీచాన్‌తో కలిసి నటించడంలేదని ఆమీర్‌ ఖాన్‌ స్పష్టం చేశారు. ఆ చిత్రంలో ఆమీర్‌ నటించనున్నట్లు కొంతకాలంగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.

''కుంగ్‌ఫూ యోగా'లో నటించాలని నేనూ కోరుకుంటున్నా. కానీ అది సాధ్యం కాదు. ఆ సినిమా చిత్రీకరణను సెప్టెంబరు-అక్టోబరు మధ్య జరపనున్నారు. అదే సమయంలో 'దంగల్‌' షూటింగ్‌తో నేను బిజీగా ఉంటాను. అందుకే ఆ చిత్రం చేయలేన''ని ఆమీర్‌ చెప్పాడు.

అయితే జాకీచాన్‌ అంటే తనకెంతో ఇష్టమన్నాడు ఆమీర్‌. ''పోలీస్‌ స్టోరీ' చూసి జాకీచాన్‌ అభిమానిగా మారిపోయా. ఆయన యాక్షన్‌తోపాటు కామెడీ పండించగల గొప్ప నటుడు. ఆయన్ను కలసినప్పుడు ఆయనెంత మంచి మనిషో అర్థమైంద''ని ఆమీర్‌ చెప్పాడు.

 Aamir Khan ditches Jackie Chan's Kung Fu Yoga

చైనా, భారత్‌ ప్రభుత్వాలు సంయుక్తంగా మూడు చిత్రాలు నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. చైనాలో బాలీవుడ్‌ చిత్రాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో రెండు దేశాలకు ప్రయోజనం కలిగేలా ఈ ఒప్పందం కుదిరింది. అందులో భాగంగానే 'కుంగ్‌ఫూ యోగా'ను నిర్మిస్తున్నారు.

త్వరలో 'కుంగ్‌ ఫూ యోగా' చిత్రంలో నటించనున్నారు జాకీచాన్‌. ఆ సినిమా చిత్రీకరణ కోసం ఇండియాకు రాబోతున్నట్లు జాకీచాన్‌ తెలిపారు. 'కుంగ్‌ ఫూ యోగా' చిత్రం తొలి ఇండియా-చైనా కో ప్రొడక్షన్ చిత్రం అవుతుంది. గత సెప్టెంబర్ లో ఈ చిత్రం సైన్ చేసారు. గతంలో జాకీచాన్..బాలీవుడ్ నటి మల్లికాషెరావత్ తో కలిసి ది మిత్ చిత్రం చేసారు. అలాగే ఆయన 2013లో చైనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ లాంచింగ్ కోసం న్యూడిల్లీ వచ్చారు.

అలాగే బాలీవుడ్‌ సినిమాలో నటించాలని ఉందన్న తన మనసులోని కోరికను జాకీచాన్‌ బయటపెట్టారు. ''నాకు హాలీవుడ్‌, బాలీవుడ్‌ అంటూ తేడాల్లేవు. స్క్రిప్టు నచ్చడం ముఖ్యం'' అన్నారు జాకీ.

అమీర్‌ నటించిన '3 ఇడియట్స్‌' చైనాలో విడుదలై అక్కడా ఘనవిజయం సాధించింది. ఆ సినిమాతోనే 'పీకే' ఆమీర్‌ అభిమానిగా మారిపోయానంటున్నాడు జాకీచాన్‌. ''నేను బాలీవుడ్‌ చిత్రాలు చూసేది చాలా తక్కువ. 2009లో హాంకాంగ్‌లో '3 ఇడియట్స్‌' చూశా. అందులో ఆమీర్‌ నటన చూడగానే వెంటనే ఆయన అభిమానిగా మారిపోయా. ఆమీర్‌ అద్భుతమైన నటుడు'' అన్నారు జాకీచాన్‌.

English summary
"Jackie Chan is planning that film with Stanley Tong who has directed a number of his films. It is not possible for me to do it... They are shooting in September-October and that time I will be busy with Dangal. I can start any film in August-September next year (sic)," Aamir told agencies.
Please Wait while comments are loading...