Aamir Khan divorce to Kiran Rao.. వారిద్దరి మధ్య జరిగింది అదే.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన ప్రాణ స్నేహితుడు
బాలీవుడ్‌లో స్టార్ దంపతులు అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులు తీసుకొంటున్నట్టు ప్రకటించడం సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. అమీర్ దంపతుల అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. తామిద్దరం పరస్పర అవగాహనతో విడిపోతున్నాం. కానీ మేము కలిసే ఉంటాం అని క్లారిటీ ఇచ్చారు. అయితే అమీర్ దంపతుల కుటుంబ అంతర్గత వ్యవహారాలు తెలిసిన స్నేహితుడు అమీన్ హాజీ ఆంగ్ల వెబ్‌సైట్ న్యూస్ 18కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను వెల్లడిస్తూ..

మాకు ముందే తెలుసు...
అమీర్ ఖాన్, కిరణ్ రావు మధ్య వ్యక్తిగత భేదాభిప్రాయాలు చోటుచేసుకోవడం, వారు విడిపోయేందుకు సిద్ధపడిన విషయం మా ఫ్యామిలీకి చాలా రోజుల క్రితమే తెలుసు. కానీ వారిద్దరూ ఈ రోజే వారు సంయుక్తంగా ప్రకటించారు. అయితే వారిద్దరూ విడిపోవడం మాకు చాలా బాధ కలిగించింది అని న్యూస్ 18కు అమీన్ హాజీ తెలిపారు.

కార్గిల్ కలిసి ఉంటూ విడాకులు విషయాన్ని
అమీర్, కిరణ్ ప్రస్తుతం కార్గిల్‌లో తన కుమారుడు ఆజాద్‌తో కలిసి ఉన్నారు. ఈ రోజు అంటే జూలై 3 తేదిన ముగ్గురు కలిసి ఉన్న ఫోటోను వారు నాకు పంపించారు. ఆ ఫోటోను చూసి.. వారు విడిపోవాలని అనుకొన్నప్పటికీ.. వాళ్లు కలిసే ఉన్నారు. వారు కేవలం విడిపోయినా ఎప్పటికీ కలిసే ఉంటారు.. కేవలం వారి వైవాహిక హోదాలో మార్పు ఉంటుంది అని అమీన్ హాజీ తెలిపారు.

నా పెళ్లికి పెద్దగా అమీర్
అమీర్, కిరణ్ రావు విడిపోవాలని నిర్ణయించుకొన్నప్పుడు వారితో మాట్లాడి చక్కదిద్దేందుకు ప్రయత్నించాం. కానీ మా ప్రయత్నాలు సఫలం కాలేదు. నా వివాహ కార్యక్రమంలో అమీర్ నాకు పెళ్లిపెద్దగా వ్యవహరించాడు. అమీర్, కిరణ్ రావు పెళ్లిలో నేను ఆయనకు పెళ్లి పెద్దగా మారాను. అలాంటి రిలేషన్ అమీర్‌తో ఉంది. కానీ వారిద్దరిని కూర్చోబెట్టి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించాను. కానీ వారు అప్పటికే తమ నిర్ణయాన్ని బలంగా తీసుకొన్నారు. కానీ నాకు ఇష్టం లేకపోయినా వారి నిర్ణయాన్ని గౌరవించాలని అనుకొన్నాను అని అమీన్ హాజీ పేర్కొన్నారు.

అమీర్, కిరణ్ విడిపోవడం...
అమీర్, కిరణ్ విడిపోవడమనే విషయం నాకు, నా ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోయింది. ఆ విషయం గుర్తు చేసుకొన్నప్పుడల్లా గుండె ముక్కలైనంత పని అవుతుంది. వారిద్దరి నిర్ణయాన్ని ఆపకపోవడం నా జీవితంలో సరిదిద్దుకోలేని ఓటమి అని నా భార్యతో అన్నాను. కొన్నిసార్లు మంచి మనుషులు కలిసి ఉండటం కూడా కష్టమే అని అమీన్ హాజీ అన్నారు.

ఆ నిర్ణయాన్ని గౌరవిద్దాం అంటూ
కిరణ్, అమీర్ ఖాన్ మానసికంగా చాలా పరిణతితో కూడిన వ్యక్తులు. జట్టుగా వాళ్లను మించిన వాళ్లు ఉండరు. వారిద్దరు కలిసి ఎన్నో విజయాలను అందుకొన్నారు. ఏది ఏమైనా వారు తీసుకొన్న నిర్ణయాన్ని వారికే వదిలివేసి గౌరవించాలి. వారిన నిర్ణయం వల్ల ఎందరికో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. చివరికి వారు సుఖ:సంతోషాలతో ఉండాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అని అమీర్ ఖాన్ స్నేహితుడు అమీన్ హాజీ వెల్లడించారు.

అమీర్, కిరణ్ రావు కాంబినేషన్‌లో
అమీర్ ఖాన్, కిరణ్ రావు వివాహం చేసుకొన్న తర్వాత వారిద్దరి కెరీర్ దూసుకెళ్లింది. లగాన్ చిత్రం సమయంలో కలుసుకొన్న వారిద్దరూ ఒక్కటైన విషయం తెలిసిందే. ఆ తర్వాత పిప్లీ లైవ్, ఢిల్లీ బెల్లీ, దంగల్ లాంటి హిట్ చిత్రాలను అందించారు. ఇలా వారిద్దరూ ప్రయాణం సజావుగా సాగుతున్న సమయంలో అమీర్, కిరణ్ తీసుకొన్న నిర్ణయం అందర్ని షాక్ గురిచేస్తున్నది.


Click it and Unblock the Notifications











