»   » 16 ఏళ్ల తర్వాత... అమీర్ ఖాన్ అవార్డు ఫంక్షన్లో, ఎమోషన్ అయ్యాడు! (ఫోటోస్)

16 ఏళ్ల తర్వాత... అమీర్ ఖాన్ అవార్డు ఫంక్షన్లో, ఎమోషన్ అయ్యాడు! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్లో తరచూ ఏదో ఒక అవార్డ్ ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఏ అవార్డు ఫంక్షన్లో కూడా బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కనిపించడు. 16 సంవత్సరాలుగా అమీర్ ఖాన్ ఏ అవార్డు ఫంక్షన్ కు హాజరు కావడం లేదు.

ఇన్నాళ్లు అవార్డు ఫంక్షన్లకు దూరంగా ఉంటూ వచ్చిన అమీర్ ఖాన్.... ఈ సారి 75వ దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్స్ ఫంక్షన్‌కి హాజరయ్యారు. దీంతో మీడియా ఫోకస్ అంతా ఒక్కసారిగా అమీర్ ఖాన్ వైపు మళ్లింది.

ఎందుకు అమీర్ ఖాన్ తిరస్కరించలేక పోయాడు

ఎందుకు అమీర్ ఖాన్ తిరస్కరించలేక పోయాడు

అమీర్ ఖాన్ ఈ అవార్డు ఫంక్షన్ ను తిరస్కరించక పోవడానికి ప్రత్యేకంగా ఓ కారణం ఉంది. ది నైటింగేల్ ఆఫ్ ఇండియా, ప్రఖ్యాత సింగర్ లతా మంగేష్కర్ స్వయంగా ఆహ్వానించడంతో అమీర్ ఖాన్ రాకుండా ఉండలేక పోయారు. అతామంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ 75వ వర్దంతి సందర్భంగా ఈ అవార్డులను ప్రధానం చేసారు.

అమీర్ ఖాన్ కు విశేష్ పురస్కార్

అమీర్ ఖాన్ కు విశేష్ పురస్కార్

దంగల్ సినిమాకు గాను అమీర్ ఖాన్ పెర్ఫార్మెన్స్, ఆయన పడ్డ కష్టానికి గాను...... ఆయన ‘విశేష్ పురస్కార్' అవార్డ్ అందించారు.

అతడి చేతుల మీదుగా అవార్డ్, అంతా ఆశ్చర్యం

అతడి చేతుల మీదుగా అవార్డ్, అంతా ఆశ్చర్యం

అమీర్ ఖాన్ ఇంటోలరెన్స్ కామెంట్స్ మీద విమర్శలు చేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ చేతుల మీదుగా అమీర్ ఖాన్ ఈ అవార్డు అందుకోవడం గమనార్హం.

అమీర్ ఖాన్ థాంక్స్ గివింగ్ స్పీచ్

అమీర్ ఖాన్ థాంక్స్ గివింగ్ స్పీచ్

అవార్డు అందుకున్న అనంతరం అమీర్ ఖాన్ మాట్లాడుతూ.... ‘ఈ రోజు నేను ఈ అవార్డ్ తీసుకుకున్నాను అంటే... ఈ క్రెడిట్ అంతా నా సినిమాకు రైటర్ గా పని చేసిన వారికే దక్కుతుంది. రచయితలు, దర్శకుడు వండర్ ఫుల్ గా పని చేయడం వల్లనే నేను ఈ రోజు ఈ అవార్డు అందుకుంటున్నాను. వారికి నా ధన్యవాదాలు' అని అమీర్ ఖాన్ వ్యాఖ్యానించారు.

అమీర్ ఖాన్ చివరి సారిగా 16 సంవత్సరాల క్రితం

అమీర్ ఖాన్ చివరి సారిగా 16 సంవత్సరాల క్రితం

16 సంవత్సరాల క్రితం అకాడెమీ(ఆస్కార్) అవార్డుల వేడుకకు అమీర్ ఖాన్ హాజరయ్యారు. అమీర్ ఖాన్ నటించిన ‘లగాన్' చిత్రం బెస్ట్ ఫిల్మ్ కేటగిరీ కింద నామినేట్ కావడంతో అమీర్ ఖాన్ ఆ అవార్డుల వేడుకకు హాజరయ్యారు. మరి ఇక నుండి అమీర్ ఖాన్ అన్ని అవార్డుల వేడుకలకు హాజరవుతారా? లేదా? అనేది చూడాలి.

English summary
Aamir Khan is known for steering away from award functions. However this time, the Bollywood superstar did make an exception.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu