»   » అమీర్‌ఖాన్ రెమ్యునరేషన్ విని.. గుండె పట్టుకొన్న బాలీవుడ్ నిర్మాత..

అమీర్‌ఖాన్ రెమ్యునరేషన్ విని.. గుండె పట్టుకొన్న బాలీవుడ్ నిర్మాత..

Written By:
Subscribe to Filmibeat Telugu

అవును నిజమే.. దంగల్ చిత్రం తర్వాత బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ నటిస్తున్న చిత్రం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్. ఈ చిత్రానికి సంబంధించి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న విషయాలు సెన్సేసనల్‌గా మారుతున్నాయి. తాజాగా థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ కోసం అమీర్ ఖాన్ డిమాండ్ చేసిన మొత్తంపై బాలీవుడ్‌లో హీరోలు చెవులు కొరుక్కొంటున్నారట.

లాభాల్లో 70 శాతం

లాభాల్లో 70 శాతం

ధూమ్3 చిత్రానికి దర్శకత్వం వహించిన విజయ్ ఆచార్య రూపొందిస్తున్న ఈ సినిమాకు నిర్మాత ఆదిత్యచోప్రా. ఈ సినిమా చర్చల్లో భాగంగా రెమ్యునరేషన్ విషయంపై చర్చ జరుగిందని, ఆ నేపథ్యంలో లాభాల్లో 70 శాతం వాటా కావాలని అమీర్ డిమాండ్ చేశారనేది బాలీవుడ్ వర్గాల్లో లేటెస్ట్ టాపిక్.


2 వేల క్లబ్‌ వైపు పరుగులు

2 వేల క్లబ్‌ వైపు పరుగులు

ఎందుకంటే దంగల్ చిత్రం ఇప్పటికే చైనాలో భారీ వసూళ్లను సాధిస్తూ.. 2 వేల క్లబ్‌ వైపు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. దేశ, విదేశాల్లో తన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ డిమాండ్ చేసినట్టు సమాచారం. ఒకవేళ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ రూ.1000 కోట్ల లాభాన్ని సంపాదిస్తే కేవలం నిర్మాత ఆదిత్యకు మిగిలేది కేవలం రూ.300 కోట్లే.


దంగల్ చిత్రం తర్వాత

దంగల్ చిత్రం తర్వాత

దంగల్ చిత్రానికి అమీర్‌ఖాన్ తీసుకొన్న రెమ్యునరేషన్ మొత్తం రూ.35 కోట్లు. అదనంగా రెవెన్యూలో మరో 33 శాతం మొత్తాన్ని వాటాగా కోరాడు. అంతేకాకుండా శాటిలైట్ హక్కులు మిగితా మరికొన్ని హక్కుల రూపంలో మరో 33 శాతం రాయల్టీ కూడా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొన్నాడు.


అమీర్‌ఖాన్‌తోపాటు అమితాబ్

అమీర్‌ఖాన్‌తోపాటు అమితాబ్

దంగల్ భారీ విజయం తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అమీర్‌ఖాన్‌తోపాటు అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫతీమా సనా షేక్ నటిస్తున్నారు. ఈ చిత్రం 2018లో విడుదలకు సిద్ధమవుతున్నది.English summary
Reports suggest that Aamir will pocket almost 70 per cent of the profits while Adi will keep the remaining percentage. Fact is, after Dangal made Rs 1000 crore, now few people question Aamir on his deals. If TOH makes that amount of money, Aditya Chopra will get almost Rs 300 crore
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu